పూనకాలు గ్యారంటీ అంతే!

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా సినిమా ‘డాకు మహారాజ్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని సంక్రాంతి బరిలో విడుదలకు సిద్దమైంది. ఈ సినిమాను డైరెక్టర్‌ బాబీ తెరకెక్కిస్తుండగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.

ఈ చిత్రానికి థమన్ సంగీతం వేరే లెవెల్‌లో ఉండబోతుందని చిత్ర యూనిట్ అంటుంది. తాజాగా ఈ మూవీ నిర్మాత నాగవంశీ ఈ చిత్రానికి థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశారు. ఈ సినిమాకు థమన్ అందించిన స్కోర్ నెక్స్ట్ లెవెల్‌లో ఉందని.. తాను రీసెంట్‌గా ఈ స్కోర్‌ని విన్నానని.. ప్రేక్షకులకు ఇది కచ్చితంగా పూనకాలు తెప్పిస్తుందని నాగవంశీ చెప్పుకొచ్చరు

దీంతో బాలయ్య సినిమాకు మరోసారి థమన్ తనదైన మార్క్ స్కోర్‌తో రెచ్చిపోయాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలయ్య పర్ఫార్మెన్స్ కూడా వేరే లెవెల్‌లో ఉండబోతుందని మూవీ టీమ్‌ ధీమా వ్యక్తం చేస్తుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories