ఏపీ రాష్ట్ర సాంకేతిక ముఖచిత్రాన్ని మార్చనున్న గూగుల్!

సాంకేతిక విప్లవపథంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళ్లడానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వం కృతనిశ్చయంతో అడుగులు వేస్తోంది. ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ అనేది  ఒక కొత్త సాంకేతిక విప్లవంగా ప్రపంచాన్ని ముంచెత్తుతున్న వేళ.. ఆ రంగంలో ఆంధ్రప్రదేశ్ యువతరాన్ని సుశిక్షితులుగా తీర్చిదిద్దడానికి, యావత్తు ప్రపంచానికి ఏఐ రంగంలో సుశిక్షితమైన మానవ వనరులను అందించడానికి ప్రభుత్వం ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ తో చేసుకున్న ఒప్పందం పట్ల ఇప్పుడు రాష్ట్రప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కృత్రిమ మేతో సహకారం కోసం, ఆరకంగా పౌరసేవలను మరింత సులభతరం చేయడం కోసం గూగుల్ తో రాష్ట్రప్రభుత్వానికి ఒప్పందం కుదిరింది.

దీనిద్వారా సంప్రదాయ పరిశ్రమలు, చిన్న వ్యాపార సంస్థలకు అవసరమైన ఏఐ ఆధారిత శిక్షణ కార్యక్రమాలను చేపడతారు. యువతకు ఏఐ ఆధారిత శిక్షణలు ఇవ్వడం, తదనుగుణమైన అవకాశాలు కల్పించడానికి గూగుల్ తో ఒప్పందం ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వం ఆశతో ఉంది. రోజువారీ జీవితంలో ఏఐ ను భాగస్వామ్యం చేసేలాగా, ఉత్పాదకత పెంచేలాగా కోర్సులను డిజైన్ చేసి, సైబర్ సెక్యూరిటీ, డేటా ఎనలిటిక్స్ తదితర రంగాల్లో  పదివేల మందికి శిక్షణలు ఏవ్వడానికి గూగుల్ తో ఒప్పందం కుదిరింది.
స్టార్టప్ ఎకో సిస్టమ్ తో కలిసి పనిచేసేలాగా ఈ ఒప్పందం ఉపకరిస్తుంది. గాలి నాణ్యత, పట్టణ ప్రణాళిక, విపత్తు నిర్వహణకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించడంలో కూడా గూగుల్ సహకరిస్తుంది. రోగనిర్ధరణ పరీక్షలను వేగవంతం చేయడం, హెల్త్ ఏఐ ఇమేజింగ్ మోడలింగ్ లకు యాక్సెస్ అందించడం కూడా ఒప్పందంలో ఒకభాగంగా ఉంటుంది.

గూగుల్ తో ఒప్పందం అనేది రాష్ట్ర సాంకేతిక పురోభివృద్ధిలో ఒక గొప్ప ముందడుగు అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంటున్నారు. మొత్తానికి ఏఐ అనేది భవిష్యత్ లో సాంకేతికంగా ప్రపంచాన్ని మరో స్థాయికి తీసుకు వెళుతుందనడంలో ఎవ్వరికీ ఎలాంటి సందేహమూ లేదు. ఏఐ ప్రపంచాన్ని శాసించే రోజులు వచ్చేలోగా.. ఏఐ విప్లవాన్ని శాసించే స్థాయిలో ఏపీ యువతరం ఉండేలాగా.. గూగుల్ తో ఒప్పందం వల్ల దక్కే శిక్షణలు అందివస్తాయి. యువతరం భవిష్యత్తు మొత్తం మారుతుంది. పౌరసేవల విషయంలో కూడా గూగుల్ తో అనుసంధానమైన సాంకేతిక విప్లవం కారణంగా ఎంతో సులభతరం అవుతుందని, సాంకేతికత ఫలితాలు ప్రతి సామాన్యుడికీ కూడా అందుబాటులోకి వచ్చే రోజులొస్తాయని అంతా అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories