మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తన అభిమానులకు ఓ శుభవార్త చెప్పాడు. తాజాగా తన కొత్త ప్రాజెక్టు గురించి అనౌన్స్ చేశాడు. గత సంవత్సరం విరూపాక్ష సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తేజ్ …ఇప్పుడు మరో కొత్త స్పెషల్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
దీనికి SDT18 అనే వర్కింగ్ టైటిల్ ను చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాను డెబ్యూ డైరెక్టర్ రోహిత్ కేపీ తీర్చిదిద్దుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.
ఈ విషయాన్ని తెలియజేస్తూ SDT18 పోస్టర్ ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. హీరో సాయి ధరమ్ తేజ్ కూడా తన కెరీర్ లో ఈ సినిమా మరింత స్పెషల్ గా ఉండబోతున్నట్లు అన్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న SDT18 తొలిషెడ్యూల్ ప్రారంభమైనట్లు సమాచారం.