తారక్‌ ఫ్యాన్స్‌ కి గుడ్‌ న్యూస్‌…15న స్పెషల్‌ వీడియో!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్‌ సినిమా దేవర. ఈ  సినిమా పై ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు వేరే లెవల్లో ఉన్నాయి. ఈ మూవీలో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్‌ తారక్‌ సరసన ఆడిపాడేందుకు రెడీ అయిన విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమా నుంచి ఆల్రెడీ వచ్చిన రెండు పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.  మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. దేవర రెండు భాగాలుగా రాబోతున్నట్టు మేకర్స్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

దేవరలో ఎన్టీఆర్‌ కు విలన గా బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ ఆలీ ఖాన్‌ నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి విడుదల చేసిన సైఫ్‌ లుక్‌ ఇప్పటికే మంచి స్పందన అందుకుంది. ఆగస్టు 15న సైఫ్‌ పుట్టిన రోజు సందర్భంగా సైఫ్‌ క్యారెక్టర్‌ ఎలా ఉంటుంది అనే దాని మీద చిన్న వీడియోను విడుదల చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది.

 సైఫ్ ఈ చిత్రంలో భైర అనే పాత్రలో కనిపించనుండగా, ఈ పాత్రకు దేవర పాత్రతో ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉంటుందట. ఈ సినిమలో సైఫ్ తో పాటు మరోక బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కూడా నటించబోతున్నాడు. దేవర పార్ట్ -2కు హింట్ ఇస్తూ బాబీ డియోల్ పాత్ర ముగుస్తుందని సమాచారం. ప్రస్తుతం బాబీ డియోల్ సీన్స్ తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు కొరటాల. ఈ ఆగస్టు చివరి నాటికి షూటింగ్ ముగింపు దశకు చేరుకుంటుందని యూనిట్ టాక్. 

Related Posts

Comments

spot_img

Recent Stories