శుభస్య శీఘ్రం: అమరావతి ఈసారి అన్‌స్టాపబుల్!

జగన్మోహన్ రెడ్డి వంటి కుట్రపూరితమైన బుద్ధి గల వ్యక్తులు మరోసారి అమరావతి మీ విషం కక్కడానికి క అవకాశం కూడా లేదు. ఏపీ రాజధాని అమరావతి నగర నిర్మాణ పనుల పునఃప్రారంభం శనివారం నాడు చంద్రబాబునాయుడు చేతుల మీదుగా చాలా ఘనంగా జరిగింది. చంద్రబాబునాయుడు గతంలో అధికారంలో ఉన్న సమయంలోనే సీఆర్డీయే కార్యకలాపాలకోసం 160 కోట్ల రూపాయలతో ప్లాన్ చేసిన ఏడంతస్తుల భవనాన్ని దాదాపుగా 80 శాతం వరకు పూర్తిచేశారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి గ్రహణం పట్టింది.ఈ అయిదేళ్లూ దానిని పట్టించుకోలేదు. చంద్రబాబు తాజాగా ఆ భవనాన్ని పూర్తిచేసేందుకు పునర్నిర్మాణ పనులు శ్రీకారం దిద్దారు.  ఆయన పూజాది కార్యక్రమాలు నిర్వహిచినది సీఆర్డీయే భనం వద్దనే కావచ్చు గానీ.. యావత్తు అమరావతి రాజధాని నగర పునర్నిర్మాణ పనులకు ఇది శ్రీకారం అనే చెప్పాలి. రాజధాని నిర్మాణాన్ని ఈసారి ఆపుచేయడం అనేది ఎవ్వరి తరమూ కాదని, ఈ పనులు ‘అన్ స్టాపబుల్’గా సాగుతాయని ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

రాజధాని ప్రాధికార సంస్థ సీఆర్డీయే కోసం చంద్రబాబు గతంలోనే ఈ భవనాన్ని ప్లాన్ చేశారు. 2017లోనే పనులు ప్రారంభించారు. ఇప్పటి వరకు 61.48 కోట్లు ఖర్చు పెట్టారు. నిర్మాణాలు దాదాపుగా పూర్తి కావచ్చిన తరుణంలో గ్రహణం పట్టినట్టుగా ప్రభుత్వం మారింది. జగన్ అసలు అమరావతి అనే పదం మీదనే కక్ష కట్టారు గనుక.. వీటిని కూడా నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు మిగిలిన పనులు పూర్తి చేయబోతున్నారు. బ్యాలెన్స్ పనులకు 160 కోట్లతో టెండర్లు పిలిచి పనులు అప్పగించారు. మంత్రి నారాయణ ప్రత్యేకంగా అడగడంతో నిర్మాణ సంస్థ కూడా పూనుకుని రెండు నెలల్లోగా సమస్తం పూర్తి చేయడానికి అంగీకరించినట్టుగా వార్తలు వస్తున్నాయి. అన్ని పనులూ పూర్తయితే రెండునెలల్లోగానే.. మునిసిపల్ శాఖకు చెందిన అన్ని విభాగాల కార్యాలయాలను అక్కడకు తరలించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

కొత్త ప్రభుత్వం కొలువుతీరిన నాలుగునెలల వ్యవధిలోనే నిర్మాణ టెండర్లు పిలవడం కూడా పూర్తిచేసి పనులు పునఃప్రారంభించడం అనేది శుభస్య శీఘ్రం అన్నట్టుగా మంచి పరిణామం అని ప్రజలు భావిస్తున్నారు. ఇదొక్కటే కాదు.. అమరావతి నిర్మాణ పనులన్నీ వేగం పుంజుకుంటున్న తీరు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. డిసెంబరులో అమరావతి నగరంలోని రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలవబోతున్నారు. అలాగే జనవరిలో ఐఏఎస్, ఎమ్మెల్యే క్వార్టర్లకు సంబంధించిన పనులను పూర్తి చేయడానికి టెండర్లు పిలవబోతున్నారు. ఐకానిక్ భవనాల విషయంలో పాత డిజైన్లతోనే పనులు పూర్తిచేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. వీటి తర్వాత.. ఆ భవనాల నిర్మాణం మొదలవుతుందని తెలుస్తోంది. అలాగే అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు పూర్తిగా కేంద్ర నిధులో జరిగే వ్యవహారం కావడంతో.. రాబోయే ఆరునెలల్లోగా ఆ పనులు కూడా మొదలవుతాయి. ఒకసారి అవుటర్ రింగ్ రోడ్డు పనులు మొదలైతే.. ప్రెవేటు నిర్మాణాలు కూడా చురుగ్గా జరుగుతాయని అనుకుంటున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ రంగసంస్థలు కూడా నిర్మాణాలు మొదలు పెడితే.. రాబోయే రెండేళ్లలో అమరావతి ప్రాంత రూపురేఖలు మారిపోతాయని ప్రజలు నమ్ముతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories