కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన అవైటెడ్ భారీ చిత్రమే “గుడ్ బ్యాడ్ అగ్లీ”. అజిత్ లోని డార్క్ షేడ్ తో చాలా కాలం తర్వాత గట్టి ట్రీట్ ఇచ్చేందుకు వస్తున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరి లేటెస్ట్ గా మేకర్స్ ఫ్యాన్స్ కి సడెన్ సర్ప్రైజ్ ఇచ్చారు అని చెప్పాలి. అజిత్ పై ఒక మాస్ అండ్ యంగ్ లుక్ పోస్టర్ తో సినిమా ట్రైలర్ ని ఎలాంటి హింట్ లేకుండా ఇవాళే రిలీజ్ చేస్తున్నట్టుగా అప్డేట్ ఇచ్చేసారు. దీనితో ఈ సర్ప్రైజ్ అప్డేట్ ఫ్యాన్స్ కి ఎగ్జైట్ చేస్తుంది. ఇక టైం ఎపుడు అనే దానికోసం ఇపుడు అభిమానులు అంతా ఎదురు చూస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కించిన మొదటి తమిళ చిత్రం ఇది కాగా ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమాపై తెలుగులో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ ఏప్రిల్ 10న రాబోతున్న ఈ సినిమా అజిత్ కెరీర్లోనే రికార్డు ఓపెనింగ్స్ అందుకుంటుంది అని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ట్రైలర్ టైం ఏంటి అనేది చూడాలి.