గోదారి గట్టు సాంగ్.. అదిరిపోయే అప్డేట్ ఇదేగా!

విక్టరీ వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబోలో రూపుదిద్దుకుంటున్న  ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ నుంచి తాజాగా విడుదలైన  ‘గోదారి గట్టు’ పాటఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఒకప్పటి ఫేమస్ సింగర్ రమణ గోగుల పాడిన ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను  విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటి వరకు యూట్యూబ్ లో ఈ పాట 35 మిలియన్ వ్యూస్ దాటేసింది.

ఈ రెస్పాన్స్ పై ఆనందంగా ఉన్న మూవీ టీమ్ ఇదే ఊపులో ఏకంగా ఫుల్ వీడియో సాంగ్ ను విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈ మేరకు ‘గోదారి గట్టు’ ఫుల్ వీడియో సాంగ్ ను ఈ రోజు సాయంత్రం విడుదల చేశారు. మాములుగా సినిమా రిలీజ్ కు ముందు జస్ట్ లిరికల్ వీడియో వదులుతారు.

కానీ సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ టీమ్ మాత్రం అందుకు భిన్నంగా ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేస్తుండటం విశేషం. బహుశా తమ సినిమాకి ఆడియన్స్ లో మరింత హైప్ రావాలని ఇలా చేస్తున్నారేమో. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమాను  శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై అగ్ర నిర్మాత దిల్‌ రాజు ప్రొడ్యూస్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షిచౌదరితో పాటు ఐశ్వర్య రాజేష్‌ హీరోయిన్లుగా చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories