బ్యాంకుల వద్దకు వెళ్ళండి.. వృద్ధుల్ని రెచ్చగొట్టండి..

వృద్ధాప్య పెన్షన్లను సచివాలయాల సిబ్బంది ఇతర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా లబ్ధిదారుల ఇళ్ళకు పంపే ఆలోచన నామమాత్రంగా కూడా చేయకుండా, కర్కశ హృదయంతో పింఛన్లు అన్నింటిని బ్యాంకు ఖాతాలకు డిపాజిట్ చేసింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. వృద్ధులను మండే ఎండల్లో బ్యాంకుల చుట్టూ తిప్పుతూ వరుసగా రెండో నెలలో కూడా వారి ప్రాణాలను తీయడానికి పూనుకుంటున్నది. ఆ చావుల ద్వారా రాజకీయ మైలేజీ కోసం సరికొత్త ఎత్తుగడ అనుసరిస్తున్నది. తమ పార్టీ అభ్యర్థులను వారి పరిధిలోని ప్రధాన బ్యాంకుల వద్దకు వెళ్లాలని, అక్కడ ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులతో మాట్లాడుతూ చంద్రబాబు కారణంగానే వారికి అలాంటి కష్టాలు వచ్చినట్లుగా విషం కక్కాలని పార్టీ అధినేతల పురమాయిస్తున్నారు. దాంతో రెండు రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.

ఏ వాలంటీర్ల ద్వారా అయితే పేద ప్రజలను, సంక్షేమ పథకాలు లబ్ధిదారులను మభ్యపెడుతూ వారిని భయపెట్టి వారి ఓట్లు గంపగుత్తగా తమ పార్టీకి వేయించుకోవచ్చు అని జగన్ మోహన్ రెడ్డి ఆశపడ్డారో, ఆ వాలంటీర్లను ఎన్నికల సంఘం పింఛన్ల పంపిణీ నుంచి దూరం పెట్టింది. దీంతో ఖంగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయ కుట్రలకు తెరలేపిన సంగతి పోయిన నెలలోనే బయటపడింది. ఏప్రిల్ నెలలో పింఛన్ల పంపిణీ సందర్భంగా లబ్ధిదారులందరిని సచివాలయాలకు రావాల్సిందిగా ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలో మండే ఎండల్లో పండు టాకులు సచివాలయాల వరకు రాలేక ఆ అవస్థలు పడలేక అక్కడ సకాలంలో డబ్బులు ఇవ్వక నానా అగచాట్లతో దాదాపు 32 మంది వరకు రాష్ట్రంలో చనిపోయారు. ప్రభుత్వం దీని నుంచి కూడా పాఠం నేర్చుకోవడానికి ప్రయత్నించలేదు.

వృద్ధులకు ఇళ్లవద్దకే డబ్బులు ఇవ్వడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఈ నెల రోజుల్లోనూ కూడా చేసుకోలేదు. మే నెల ప్రారంభమైన తర్వాత మరో రకమైన కుటిల నీతికి తెర లేపింది. ఒకవైపు ఇళ్లవద్దనే పెన్షన్లు ఇచ్చేయాలని చంద్రబాబునాయుడు పదే పదే మొత్తుకుంటున్నప్పటికీ వారి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తాం అంటూ కొత్త డ్రామా చేశారు. ఇప్పుడు ప్రజలందరూ బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.

గత నెలలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలే వృద్ధులు, పండుటాకులను బలవంతంగా భయపెట్టి సచివాలయాల వరకు తీసుకువస్తూ డ్రామాలు నడిపించి వారి ప్రాణాలు బలితీసుకున్నారు. ఇప్పుడు వారు వృద్ధుల వద్దకు వెళ్లి బ్యాంకుకు ఇవాళ వెళ్లకపోతే పెన్షన్ రాదు అన్నట్టుగా భయపెడుతూ మండే ఎండల్లో బ్యాంకుకు వెళ్లేలా వారిని పురిగొల్పుతున్నారు. వారి చావులకు కారణం అవుతున్నారు. ఒకవైపు ఉండే లబ్ధిదారులందరినీ బ్యాంకుకు తోలడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పని చేస్తుంటే, బ్యాంకు వద్ద ఎమ్మెల్యేలు తిష్ట వేసి వచ్చే ప్రతి వృద్ధులతో మాట్లాడుతూ మీకు ఈ కష్టాలు వచ్చాయంటే అందుకు కారణం చంద్రబాబు అని విషం చిమ్ముతున్నారు.  రెండురోజులుగా వైసీపీ పార్టీ వాళ్ళ తాజా డ్రామాలన్నీ బ్యాంకుల చుట్టూ నడుస్తూ ఉండడం గమనార్హం.

Related Posts

Comments

spot_img

Recent Stories