టాలీవుడ్ లో ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్ పోతినేని నటిస్తున్న తాజా సినిమా మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో రామ్ కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుండగా, దర్శకత్వ బాధ్యతలు మహేష్ బాబు నిర్వహిస్తున్నారు. సినిమాను అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు రామ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఇచ్చిన టైటిల్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.
ఈ గ్లింప్స్ కొద్దిగా ఆలస్యంగా వచ్చిందైనా, రిలీజ్ అయిన వెంటనే అందరి దృష్టిని ఆకర్షించింది. రామ్ నటన, స్క్రీన్ ప్రెజెన్స్ తో పవర్ ఫుల్‌గా కనిపించాడు. సినిమాల్లో పెద్ద హీరో కొత్త సినిమా వస్తే థియేటర్ల దగ్గర జరిగే హడావిడిని చాలా రియలిస్టిక్‌గా చూపించారు. టికెట్లు తీసుకునే కౌంటర్ దగ్గర ఉండే హల్చల్, ఫ్యాన్స్ రియాక్షన్స్ అన్నీ కలిపి ఆసక్తికరంగా ఉన్నాయి.
ఇక రామ్ ఈ గ్లింప్స్‌లో తన ఎనర్జీతో అలరిస్తే, చివర్లో వచ్చే ట్విస్ట్ మరింత అట్రాక్షన్ గా నిలిచింది. రామ్ తన అభిమానాన్ని ఎవరిపై ఉంచాడో చివర్లో రివీల్ చేయడం స్పెషల్ గా మారింది. ఆ రివీల్ లో రామ్ టాలీవుడ్ కింగ్ ని ఫాలో అవుతున్నట్లు చూపించారు. ఇది చూసి అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.
వివేక్ – మెర్విన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగా కుదిరింది. ఇది చూస్తుంటే దర్శకుడు మహేష్ బాబు నుంచి ఒక మాస్ అండ్ కమర్షియల్ ప్యాకేజ్ రాబోతుందన్న నమ్మకం వస్తోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. విడుదల తేదీకి సంబంధించిన సమాచారం త్వరలోనే తెలియజేయనున్నారు.
మొత్తానికి రామ్ సినిమా టైటిల్ గ్లింప్స్‌తో మంచి పాజిటివ్ బజ్ తెచ్చుకున్న ఈ సినిమా పైన అంచనాలు భారీగా పెరిగిపోయాయి.