హారర్ మిస్టరీగా ‘కిష్కింధపురి’ గ్లింప్స్…సూపర్‌ అంతే!

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న తాజా సినిమా  ‘కిష్కింధపురి’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాను దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి పూర్తి హారర్ మిస్టరీగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో అందాల భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల ఈ చిత్ర టైటిల్‌ను అనౌన్స్ చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది.

అయితే, తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో ఆద్యంతం ఉత్కంఠను రేపేలా మలిచారు. హారర్ ఎలిమెంట్స్‌కు సస్పెన్స్ తోడైతే ఆ ఫార్ములా సూపర్ హిట్. ఇప్పుడు ఈ ఫస్ట్ గ్లింప్స్‌లోనూ ఇలాంటి ఫార్ములా మనకు కనిపిస్తుంది. ఓ పాడుబడ్డ బంగ్లాలోని గదిని తెరవడంతో జరిగే అనర్ధాలు ఎలా ఉంటాయనేది మనకు ఈ ఫస్ట్ గ్లింప్స్‌లో శాంపిల్ చూపెట్టారు. ‘కొన్ని తలుపులు ఎప్పటికీ తెరవకూడదు.. కొన్ని గొంతులు ఎప్పటికీ వినకూడదు’ అనే ట్యాగ్‌లైన్స్ మనకు ఈ గ్లింప్స్‌లో కనిపిస్తాయి. ఇక సినిమాలో ఈ అంశాలను ఎలా చూపెట్టబోతున్నారనేది తాజాగా ఆసక్తి రేపుతుంది.

ఈ సినిమాకు సామ్ సిఎస్ సంగీతం మేజర్ అసెట్‌గా నిలవబోతుందని ఈ ఫస్ట్ గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories