గోవా ముద్దుగుమ్మ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఈ ముద్దుగుమ్మ దేవదాసు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ఈ అమ్మడు స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. అయితే తెలుగులో ఈ భామ కెరీర్ మంచి స్టేజ్ లో ఉన్నసమయంలోనే బాలీవుడ్ కి వెళ్ళింది. దీంతో ఈ భామ సౌత్ సినిమాలకు దూరం అయిపోయింది.
అయితే బాలీవుడ్ లో అయినా ఈ భామకు వరుసగా బడా ఆఫర్స్ వచ్చాయా అనుకుంటే అది లేదు. బాలీవుడ్ లో ఆమె చేసిన సినిమాలేవీ పెద్దగా ఆకట్టుకోలేదు.దీంతో అక్కడ కూడా ఈ భామకు ఆఫర్స్ తగ్గిపోయాయి. ఇదిలా ఉంటే ఇటీవల పెళ్ళి కాకుండానే తల్లి అయి ఇలియానా బాగా పాపులర్ అయ్యింది. ఆ తరువాత ఇలియానా తన ప్రియుడిని పరిచయం చేసింది. అయితే బాలీవుడ్ లో ఆఫర్స్ తగ్గిపోవడంతో ఇలియానా తన గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
హాట్ హాట్ ఫోటోషూట్ తో రెచ్చగొట్టేది. ప్రస్తుతం ఈ భామ మళ్ళీ సౌత్ సినిమా వైపు చూస్తున్నట్లు సమాచారం. తనకి మరోసారి ఛాన్స్ ఇస్తే తన టాలెంట్ చూపిస్తానని ఇలియానా డైరెక్టర్స్ ని అడుగుతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. అయితే ఇలియానాకు సౌత్ లో అవకాశం వస్తుందో లేదో చూడాల్సిందే మరి.