నా దృష్టిలో రొమాన్స్‌ అంటే వేరు అంటున్న సీతామహాలక్ష్మి!

యంగ్‌ అండ్‌ బ్యూటీఫుల్‌ ముద్దుగుమ్మ మృణాల్‌ ఠాకూర్‌ బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చింది. టాలీవుడ్‌ లో స్టార్ నటుడు  దుల్కర్ సల్మాన్‌తో ‘సీతారామం’ మూవీలో సీతామహాలక్ష్మి పాత్ర చేసి రాత్రికి రాత్రే పెద్ద స్టార్‌ అయిపోయింది. ఈ సినిమాలో మృణాల్ ఎంతో అందంగా సంప్రదాయంగా కనిపించి అందరి మనసులు దోచేసింది.  ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరై విపరీతమైన పాపులారిటీ సంపాదించేసుకుంది.

ఈ అమ్మడు తెలుగులో ఆ తరువాత చేసిన సినిమాలు కూడా మంచి హిట్ టాక్‌ ను అందుకోవడంతో భామ క్రేజ్‌ బాగా పెరిగిపోయింది. ఇటీవల మృణాల్ కల్కి సినిమాలో గెస్ట్ రోల్‌లో నటించి మెప్పించి రెమ్యునరేషన్ తీసుకోకుండా అందరి చేత ప్రశంసలు అందుకుంది.ఈ క్రమంలో.. తాజాగా, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని రొమాన్స్ గురించి పలు ఆసక్తికర కామెంట్లు చేసింది. ‘‘ రొమాన్స్ అనేది నా దృష్టిలో మనకు నచ్చిన వాళ్ళు మనతో నిజాయితీగా ఉండటంతో పాటు శ్రద్ధ చూపించడం. మన కోసం చిన్న చిన్న పనులు చేయడం మన ఆలోచనలో ఉండటం గొప్ప రొమాన్స్. 

చిన్న స్పర్శ చాలు ఇతరులకు మనపై ఎంత ప్రేమ ఉందో అర్థం కావడానికి. రొమాన్స్ అంటే చిన్న చిన్న చేష్టలతోనే ఉండేది. కానీ అది కొందరి దృష్టిలో మరో విధంగా ఉంటుంది’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మృణాల్ హిందీ పైనే పూర్తిగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అక్కడ బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే తెలుగులోనూ వరుస ఆఫర్లను ఈ ముద్దుగుమ్మ అందుకుంటున్నట్లు తెలుస్తుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories