గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్లో 16వ సినిమాగా దీనిని ప్లాన్ చేస్తుండగా గేమ్ ఛేంజర్ లాంటి వైఫల్యం ఉన్నప్పటికీ ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఈ మార్చ్ 27 రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా ట్రీట్ ఉంటుందా లేదా అనే సంశయం అభిమానుల్లో ఉంది కానీ ఇపుడు డెఫినెట్ గా ఈ ట్రీట్ ఉంటుంది అని తెలుస్తుంది.
అలాగే టైటిల్ గ్లింప్స్ పనులు ఆల్రెడీ పూర్తి కాగా ఏ ఆర్ రెహమాన్ దానికి సాలిడ్ స్కోర్ ని అందించే పనిలో ఉన్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. ఇక వీటితో ఏ సమయంలో అయినా ఈ సినిమా అప్డేట్ ఇపుడు రానున్నట్టుగా టాక్. ప్రస్తుతానికి అయితే పెద్ది అనే టైటిల్ తోనే మేకర్స్ సాలిడ్ గ్లింప్స్ ని వదిలే సన్నాహాలు చేస్తున్నారట. మరి ఇది ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ కూడా సహకారం అందిస్తున్నారు.