కోలీవుడ్ సినిమా దగ్గర ఉన్న విలక్షణ సినిమా మేకర్స్ తో సాలిడ్ సినిమాల దర్శకుడు వెట్రిమారన్ ఒకరనే సంగతి తెలిసిందే. తన రా అండ్ రస్టిక్ సినిమాలతో అదరగొట్టిన తాను ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ “విడుదల పార్ట్ 2” తో అయితే రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత దర్శకుడు వెట్రిమారన్ నుంచి అనేది ఆసక్తిగా ఇపుడు మారగా దాని గురించి ఓ ఇంట్రెస్టింగ్ టాక్ ఇపుడు వినపడుతుంది.
దీనితో తమిళ్ లో మరో టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ మీనన్ వెట్రిమారన్ ఇచ్చిన కథతో సినిమా చేయనున్నట్టుగా సమాచారం. అలాగే ఈ సినిమాలో హీరోగా యంగ్ హీరో శింబు నటిస్తాడని ఓ సమాచారం నడుస్తుంది. మరి ఈ క్రేజీ కాంబో ఎంతవరకు నిజం అనేది చూడాల్సిందే మరి. వెట్రిమారన్ తెరకెక్కించిన విడుదల 2 లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అలాగే సూరి ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేయగా… ఈ డిసెంబర్ 20న సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతుంది.