ఫైనల్ స్టేజ్‌ కు గేమ్‌ ఛేంజర్‌!

మెగా పవర్‌ స్టార్‌, గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నటిస్తున్న లేటేస్ట్‌ మూవీ గేమ్‌ ఛేంజర్‌. ఈ సినిమాని కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ని దిల్‌ రాజు ఎంతో ప్రతిష్టాతక్మంగా రూపొందిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టి చాలా కాలమే అయినప్పటికీ  ఇంకా షూటింగ్ కంప్లీట్ పూర్తి కాలేదు

 ప్రపంచ వ్యాప్తంగా రాంచరణ్ ఫ్యాన్స్ తన తరువాత సినిమాకోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ మొదలైన దగ్గరినుంచి అనుకోని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.  శంకర్ కమల్ హాసన్ తో ఇండియాన్ 2 పూర్తి చేసే పనిలో ఉండడంతో  “గేమ్ చేంజర్” షూటింగ్ బాగా ఆలస్యం అయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది

.’ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత రామ్‌చరణ్‌ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు వచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం చెన్నైలో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని ఇండస్ట్రీలో టాక్‌.

ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా రామ్‌చరణ్‌ డ్యూయల్ రోల్ చేసున్నట్లు సమాచారం.ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ అంజలి కీలక పాత్ర పోషిస్తుంది.అలాగే ఈ సినిమాలో సముద్రఖని, ఎస్‌.జె.సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌ మరియు నవీన్‌చంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు .

Related Posts

Comments

spot_img

Recent Stories