ఆ దర్శకుని కోసం ఏకంగా 33 వేల అడుగుల ఎత్తు నుంచి!

కోలీవుడ్‌ స్టార్ డైరెక్టర్‌ ఏఆర్‌ మురుగదాస్‌ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఆయన చేస్తున్న సినిమాల్లో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ తో చేసే సినిమా సికిందర్‌ ఒకటి. ఈ సినిమా గురించే ఇటీవలే అధికారిక ప్రకటన బయటకు వచ్చింది. ఈ సినిమాలో రష్మిక కథానాయికగా చేస్తున్నట్లు సమాచారం.

ఈ సినిమా భారీ యాక్షన్‌ సన్నివేశంతో ఈ సినిమా చిత్రీకరణ జూన్‌ 18న ముంబైలో మొదలు కానుంది.  సముద్ర మట్టానికి 33 వేల అడుగుల ఎత్తులో విమానంలో భయపెట్టే యాక్షన్ సన్నివేశాన్ని మేకర్స్‌ చిత్రీకరించబోతున్నారు. ఈ సినిమాని సాజిత్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్నారు.

ఈ సన్నివేశం ఈ సినిమాకే కీలకమని చిత్ర బృందం తెలిపింది. రష్మిక ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉంది. ఆమె బిజీ షెడ్యూల్‌ పూర్తి కాగానే ఆమె కూడా ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొననున్నట్లు సమాచారం.

Related Posts

Comments

spot_img

Recent Stories