టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి తాజా సినిమా ‘ఘాటి’పై ఇప్పటికే సినీ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. పాన్ ఇండియా రేంజ్‌లో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు బాగా పెరిగాయి. సెప్టెంబర్ 5న ఈ సినిమాను భారీగా థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించగా, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలా ఆడుతుందో చూడాలని అందరూ ఎదురుచూస్తున్నారు.
తాజాగా నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సొంతం చేసుకున్నారని సమాచారం. ఇప్పటికే యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఇప్పుడు మైత్రీ డిస్ట్రిబ్యూషన్ కూడా జత కావడం వల్ల ఈ ప్రాజెక్ట్‌పై వారు ఎంత నమ్మకంగా ఉన్నారో తెలుస్తోంది.
ఈ సినిమాలో అనుష్కతో పాటు విక్రమ్ ప్రభు ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.