ఉర్సాకు ఉచితం’: విషం కక్కుతున్న జగన్ దళాలు!

విదేశాలలో కూడా విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ ఉర్సా క్లస్టర్స్.  ఈ సంస్థలో తెలుగువారే ఎక్కువ. తమ స్వరాష్ట్రాల్లో తెలుగు ప్రాంతాల్లో కూడా సంస్థ తరఫున ఏదో ఒకటి చేయాలనే సదుద్దేశంతో వారు ప్రాజెక్టు ప్రపోజల్స్ తో వచ్చారు. తెలంగాణలోని రేవంత్ ప్రభుత్వం కూడా.. ఉర్సా క్లస్టర్స్ తో హైదరాబాదులో వంద ఎండబ్ల్యు ఏఐ డేటా హబ్ సెంటర్ ను ఏర్పాటుచేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. అదే క్రమంలో ఏపీ ప్రభుత్వంతోకూడా ఒప్పందాలు కుదిరాయి. విశాఖలో భూ కేటాయింపులకు కూడా ప్రభుత్వం ఓకే చెప్పింది. అయితే ఈ వ్యవహారంపై జగన్ దళాలు, ఆయన కరపత్రికలు అదేపనిగా విషం కక్కుతున్నాయి. వాస్తవాలను పూర్తిగా మరుగునపెట్టి.. అబద్ధాలతో ప్రజలను మోసం చేయాలేని కుట్రలు పన్నుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నంలో డేటా హబ్ సెంటర్ ను ఏర్పాటుచేయడానికి ఉర్సా క్లస్టర్స్ ముందుకొచ్చింది. మొత్తం 5728 కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్టు ఏర్పాటుచేయాలనేది ప్రతిపాదన. దీనివలన 2500 మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయనేది వారి హామీ. ఈ నేపథ్యంలో వారికి భూములు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖలో మూడున్నర ఎకరాల భూమిని ఎకరా కోటి రూపాయల వంతున, కాపులుప్పాడలో 56 ఎకరాల భూమిని ఎకరా రూ.50 లక్షల వంతున కేటాయించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

అయితే ఇక్కడే జగన్మోహన్ రెడ్డి దళాల దుష్ప్రచారం ప్రారంభం అయింది. ఉర్సా కంపెనీకి మూడువేల కోట్ల రూపాయల భూమిని కేవలం ఎకరా 99 పైసలకు ఇచ్చేస్తున్నారంటూ.. నానా యాగీ చేయడం ప్రారంభించారు. ఈ ప్రచారంలో కనీసం 0.1 శాతం అయినా నిజం లేదు. ఎందుకంటే.. విశాఖలో దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ను ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్న టీసీఎస్ కు మాత్రమే ఎకరా 99 పైసలకు లీజు కు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఉర్సాకు ఇస్తున్నది లీజు విధానంలో కాదు. కేవలం భూముల్ని విక్రయిస్తున్నారు. అదికూడా తక్కువ ధరలేమీ కాదు. ఎకరా కోటి, అరకోటి వంతున విక్రయిస్తున్నారు. ఆ సంస్థలు భూమిని కొనుగోలు చేసి తమ కార్యకలాపాలు ప్రారంభించబోతున్నాయి. అయితే రాష్ట్రానికి సంస్థలు రావడం, ఇక్కడి యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు ఏర్పడడం అనేదే జగన్ దళాలకు కంటగింపుగా ఉన్నట్టుంది. అందుకే ఉర్సాకు సంబంధం లేని 99 పైసల ఆరోపణలతో వారినిబద్నాం చేయడానికి జగన్ కరపత్రికలు, ఆయన నీలిదళాలు విపరీతంగా శ్రమపడుతున్నాయి. ప్రజలను తమ గోబెల్స్ ప్రచారంతో తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే ప్రజలు మాత్రం.. ఈ అడ్డగోలు ప్రచారాల్ని నమ్మకుండా.. తమ వివేచనతో అడుగులు వేస్తుండడం, జగన్ దుర్బద్ధులను గ్రహిస్తుండడం విశేషం.

Related Posts

Comments

spot_img

Recent Stories