ఏపీ రాజకీయాల్లో తాజాగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. రాయదుర్గం పోలీసుల సహాయంతో గురువారం ఉదయం వంశీని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు ఆయన్ను అక్కడి నుంచి విజయవాడకు తీసుకుని వస్తున్నారు.
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ కేసులోనే వంశీని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 2023 ఫిబ్రవరి 20వ తేదీన గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేని వంశీ ఆరోపణలు ఎదురుకుంటున్నారు.
ఇందులో వల్లభనేని వంశీ సహా 88 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు. ఈ కేసులో 2025 ఫిబ్రవరి 20వ తేదీన వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తీర్పు రానుంది. ఈ లోపు ఏపీ పోలీసులు వంశీని అరెస్టు చేయడం చర్చనీయాంశంంగా మారింది.