గురువింద గింజ తన కింద ఉన్న నలుపును ఎరగదన్నట్లు ఉంది వైఎస్ జగన్ పని..వైసీపీ అధినేత జగన్ ఇంకా ముఖ్యమంత్రి హోదాలోనే ఉన్నారనుకుని ఫీల్ అవుతున్నట్లున్నారు. సీఎం గా ఉన్నప్పుడు టీడీపీ అధినేతను, ఆయన కుటుంబాన్ని ఎన్నో సార్లు ఆయన విమర్శించారు. బూతులు తిట్టారు. తన మంత్రి వర్గం చేత కూడా తిట్టించారు.
వైసీపీ గుండాలతో దాడులు కూడా చేయించారు. ఆ విషయాలన్నిటిని మర్చిపోయి ఇప్పుడో ఆయన కార్యకర్త మీద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేస్తే ఆ విషయం గురించి చంద్రబాబుకే వార్నింగ్ ఇస్తున్నాడు జగన్. వైసీపీ నేత అజయ్ రెడ్డిని మాజీ సీఎం జగన్ శనివారం ఆసుపత్రిలో పరామర్శించారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో ఆయన గాయపడి రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. వైసీపీకి చెందిన వ్యక్తి అని అదే పనిగా వాహనాల్లో వచ్చి ఆసుపత్రి పాలు చేశారని మండిపడ్డారు.
పులివెందులలో ఇలాంటి సంప్రదాయం గతంలో ఎప్పుడూ జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత అంతా కలిసి ఉండే పరిస్థితి అని.. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చెడు సంప్రదాయానికి తెర లేపారన్నారు. భయాందోళన వాతావరణం సృష్టించాలని చూస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఇలాంటి దాడులను ఆపాలని చంద్రబాబును హెచ్చరిస్తున్నానన్నారు.
వ్యవస్థను గాడిలో పెట్టాలని.. మోసపురిత వాగ్దానాలు నమ్మి ప్రజలు ఓట్లేశారని.. ఇచ్చిన హామీలు అమలు చేయాలని సూచించారు. ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు గుర్తు రాని మాటలు, అమలు చేయాని వాగ్ధానాల గురించి ఇప్పుడు జగన్ మాట్లాడటం హాస్యాస్పదం గా ఉంది.