టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్‌లో 100వ సినిమా ప్రత్యేకంగా రూపుదిద్దుకోబోతోందని సమాచారం వస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తుండగా, దసరా పండుగ రోజున అధికారికంగా లాంచ్ చేయాలని యూనిట్ సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు కార్తిక్ దర్శకత్వం వహించనుండగా, యాక్షన్‌తో పాటు కుటుంబానికి దగ్గరగా ఉండే భావోద్వేగాలు కూడా ప్రధానంగా ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను నాగార్జున స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మించనున్నారు. టైటిల్ విషయానికి వస్తే “100 నాట్ ఔట్” అనే పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. లాంచ్ వేడుకను మరింత గ్రాండ్‌గా చేయడానికి ఇండస్ట్రీలోని ప్రముఖులు హాజరుకానున్నారు. మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టబోతున్నారని, అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా హాజరవుతారని టాక్ ఉంది. వీరి రాకతో ఈ వేడుక మరింత ప్రత్యేకంగా మారనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.