బన్నీ-అట్లీ ప్రాజెక్టులో ఐదుగురు ముద్దుగుమ్మలు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో పుష్ప 2 తో ఒక రీసౌండింగ్ హిట్ కొట్టిన తర్వాత చేస్తున్న భారీ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు అట్లీని తెలుగు తెరకి పరిచయం చేస్తూ చేస్తున్న సినిమా ఇది కాగా దీనిని ఒక సాలిడ్ సై ఫై కం ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా భారీ బడ్జెట్ తో అట్లీ ప్లాన్ చేస్తున్నాడు.

అయితే ఈ సినిమాలో బన్నీ మొత్తం మూడు పాత్రల్లో కనిపిస్తాడని టాక్ వినిపిస్తుండగా ఈ ముగ్గరు హీరోలకి ఏకంగా ఐదుగురు హీరోయిన్స్ ఉంటారని ఇపుడు కొత్త రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఆల్రెడీ నాలుగురు ఫిక్స్ కాగా ఐదో హీరోయిన్ ని అట్లీ లాక్ చేసే పనిలో ఉన్నాడట.

మరి ఆమె ఎవరు ఏంటి అనేది అధికారికంగా అందరి పేర్లు ఇంకా బయటకి రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి యంగ్ అండ్ టాలెంటెడ్ సంగీత దర్శకుడు సాయి అభయంకర్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories