ఫస్ట్‌ టైం!

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం పుష్ప 2 తో పాన్ ఇండియా లెవెల్లో రికార్డులు తిరగరాసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత బన్నీ నుంచి సాలిడ్ లైనప్ సిద్ధంగా ఉంది. మరి ఈ సినిమాల్లో సందీప్ రెడ్డి వంగ, త్రివిక్రమ్ ఆలాగే అట్లీ లాంటి బిగ్ స్టార్స్ సిద్ధంగా ఉండగా వీరిలో నెక్స్ట్ సినిమాగా అట్లీతో సినిమా స్టార్ట్ అయ్యే సూచనలు ఉన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

మరి ఈ సినిమాపై లేటెస్ట్ టాక్ ఒకటి వినిపిస్తుంది. దీనితో బన్నీ తన ఇన్నేళ్ల కెరీర్లో చేయని స్టెప్ మొదటిసారి ఈ సినిమా కోసం తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. బన్నీ ఇన్నేళ్ల సినిమాల్లో డ్యూయల్ రోల్ చేసింది లేదు. మరి ఇలాంటి సినిమాలకి స్పెషలిస్ట్ అట్లీ.. సో తమ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా బన్నీ ఫస్ట్ టైం ఇలా కనిపించనున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.

Related Posts

Comments

spot_img

Recent Stories