బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం ‘జాట్’ కోసం అందరికీ తెలిసిందే. మన టాలీవుడ్ స్టార్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ చిత్రం ఇపుడు రిలీజ్ కి రాబోతుంది. ఇక ఈ సమయంలో మేకర్స్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు. టచ్ కియా అంటూ సాగే ఈ సాంగ్ ని థమన్ సాలిడ్ బీట్స్ తో కొట్టాడని చెప్పాలి. ఇక ఈ స్పెషల్ సాంగ్ లో ప్రముఖ బ్యూటీ ఊర్వశి రౌటేలా ఇందులో కనిపించడం విశేషం.
ఇక ఈ సాంగ్ కి జానీ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేయగా తన కొరియోగ్రఫీ ఈ సాంగ్ కి పర్ఫెక్ట్ గా ఉందని చెప్పవచ్చు. ఇక ఈ సాంగ్ లో బాలీవుడ్ నటుడు రణదీప్ హూడా ఆలాగే యంగ్ నటి రెజీనా కాసాండ్రా కూడా కనిపిస్తున్నారు. మంచి పార్టీ అండ్ సెలబ్రేషన్ సాంగ్ గా ప్లాన్ చేసిన ఈ సాంగ్ లో సన్నీ డియోల్ ప్రెజెన్స్ అయితే లేనట్టే ఉందని చెప్పాలి. మొత్తానికి అయితే హిందీ ఆడియెన్స్ కి ఈ సాంగ్ నచ్చే రేంజ్ లో అనిపిస్తుంది. ఇక ఈ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఈ ఏప్రిల్ 10న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.