ఫస్ట్‌ ఛాయిస్‌ సాయి పల్లవి కాదు!

బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజయస్ చిత్రాల్లో నితీశ్ తివారి డైరెక్ట్ చేస్తున్న ‘రామాయణం’ కూడా ఒకటి. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, అందాల లేడీ పవర్‌ స్టార్‌ సాయి పల్లవి సీతగా యాక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. రావణాసురుడిగా యశ్ నటిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

అయితే, ఈ మెగా ప్రాజెక్ట్‌లో తొలుత సీత పాత్ర కోసం సాయి పల్లవి కంటే ముందు వేరొక హీరోయిన్ ఆడిషన్ చేసినట్లు సమాచారం. ఆమె ఎవరో కాదు.. ‘హిట్-3’ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న శ్రీనిధి శెట్టి. ‘కేజీయఫ్’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో ఆమె మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘రామాయణం’ సినిమాలో సీత పాత్ర కోసం ఆమె ఆడిషన్ ఇచ్చినట్లు పేర్కొంది.

కానీ కేజీఎఫ్ సినిమాలో యశ్ పక్కన హీరోయిన్‌గా చేసిన తర్వాత, ఆయన రావణుడిగా, తాను సీతగా నటిస్తే ప్రేక్షకులకు నచ్చదేమో అనే ఫీలింగ్ కలిగిందని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. దీంతో సీత పాత్రలో నటించే అవకాశం సాయి పల్లవి దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ‘హిట్-3’లో తన పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండబోతుందని శ్రీనిధి వివరించింది.

Related Posts

Comments

spot_img

Recent Stories