మాఫియాను తలపించేలా పీలేరులో కాల్పులు!

మనం చాలా మాఫియా సినిమాల్లో చూస్తూ ఉంటాం. మాఫియా డాన్.. తన కష్టాలు చెప్పుకోవడానికి, తన ప్రత్యర్థుల వల్ల ముప్పు ఉన్నదని ఆవేదన చెప్పుకోవడానికి డీజీపీ లేదా కమిషనర్ వంటి పోలీసు ఉన్నతాధికారి వద్దకు వెళ్లి.. తన గోడు చెప్పుకుంటూ ఉంటాడు. కాకపోతే ఎవరైనా పెద్ద నాయకుడితో కలిసి.. దైవదర్శనానికి గుడికి వెళ్తాడు. లేదా, తన మీద దాడులు జరుగుతున్నాయంటూ పబ్లిక్ లో ధర్నాకు కూర్చుంటాడు.

సరిగ్గా ఆయన ఆ యాక్టివిటీలో ఉన్న సమయంలో.. ఆయన ప్రత్యర్థి ముఠాకు సంబంధించిన అందరినీ ఒక్కొక్కరుగా లేపేస్తూ ఉంటారు. వరుస హత్యలు జరుగుతాయి. ఏ హత్యలో కూడా, ఈ మాఫియా డాన్ పేరు వినిపించడానికి అవకాశం లేదు. ఎందుకంటే.. ఆయన అందరి కళ్లెదురుగా వేరే పనిలో ఉండగా.. ఈ హత్యలు జరిగాయి కాబట్టి.. అని తేల్చేస్తారు.

అచ్చంగా ఇదే తరహాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ కక్షలు, ఫ్యాక్షన్ హత్యలు గా మారి ప్రమాదకరంగా తయారవుతున్నాయా? అనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది. ఎందుకంటే.. వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ వారి మీద దాడులు జరుగుతున్నాయని, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండాపోయాయని ఆరోపిస్తూ ఢిల్లీలో ధర్నాకు కూర్చుంటున్నారు.

అక్కడలా జరుగుతుండగానే.. ఇక్కడ పీలేరులో తెలుగుదేశం నాయకుడు గిరినాయుడు ఇంట్లోకి పదిమంది దుండగులు చొరబడి ఆయనను హత్య చేయడానికి ప్రయత్నించారు. ఆయన మీద తుపాకీతో కాల్పులు జరిపారు.
తన మీద దాడికి దిగిన దుండగులను ప్రతిఘటించిన గిరినాయుడు.. తేరుకుని వారితో కలబడి వారినుంచి తుపాకీని లాక్కోవడంతో.. వారంతా బైక్ పై పారిపోయినట్టుగా తెలుస్తోంది.

కాల్పులు తెలుగుదేశం నాయకుడి మీద జరిగాయి గనుక.. సహజంగా వైఎస్సార్ కాంగ్రెస్ వారికి చెందిన వారి పనే అనే అనుమానం కలుగుతుంది. పీలేరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జగనన్న ఢిల్లీలో ధర్నాకు కూర్చుంటూ.. ఇక్కడ తన శ్రేణులను అల్లకల్లోలం చేయసేయాల్సిందిగా పురమాయించి వెళ్లారా? అనే ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. పీలేరులోని తెదేపా నేత గిరినాయుడు మీద హత్యాయత్నం ఖచ్చితంగా వైసీపీ వారి పనే అని కూడా అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories