ప్రెస్‌మీట్‌లంటే భయం : అందుకే జగన్ న్యూ స్టయిల్!

సార్వత్రిక న్నికల ముందునాటి పరిస్ితులు గుర్తున్నాయా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక వ్యక్తులు.. అనగా, జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామక్రిష్ణారెడ్డి లాంటి వాళ్లు. తాము ఎంపిక చేసుకున్న కొన్ని తెలుగు టీవీ న్యూస్ చానెళ్లకు మాత్రం ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. వారు అా ఎకస్ కలూజివ్ ఇటర్వ్యూలను స్క్రీన్ టైం కొనుక్కుని ఇచ్చారో లేదో.. చానెల్ స్వచ్ఛందంగానే ఇంటర్వ్యూ చేిందో మనకు తెలియదు గానీ.. ఏకబగిన మూడు గంటల వరకు సాగే ఇంటర్వ్యూలను కూడ ఏకంగా లైవ్ చానెల్లోనే చూపించారు.

అయితే విషయం ఏంటంటే.. ఈ ఇంటర్వ్యూలో సజ్జల రామక్రిష్ణారెడ్డ మాట్లాడుతూ.. తమ నాయకుడు, (అప్పటి) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రెస్ మీట్లు పెట్టాలంటే కొంత భయం ఉన్నమాట నిజమేనని ఒప్పుకున్నారు. అంటే ఏమిటన్నమాట.. ప్రెస్ మీట్ లు పెట్టాలంటే తనలో భయం ఉన్న సంగతి జగన్ కు కూడా తెలుసునన్నమాట. అందుకే బహుశా ఆయన తన అయిదే్ల పదవీకాలంలో ఒక్కటంటే ఒక్క ప్రెస్మీట్ పెట్టని అరుదైన నాయకుడిగా రికార్డు సృష్టించారు. ట్విస్టు ఏంటంటే.. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చాలా తరచుగా మీడియాతో మాట్లాడుతున్నారు. ముచ్చటిస్తున్నారు. తరచూ వారిని పిలిచి.. చంద్రబాబు మీద నిందలు వేస్తున్నారు.. తదితర వ్యవహారాలు జరుగుతున్నాయి. ప్రతిపక్ష నాయకుడిగా మిగిలిపోగానే.. ఆయనో ప్రెస్ మీట్ల పట్ల ఉన్న భయం తొలగిపోయిందా? అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది.

కానీ అది నిజం కాదు. ఆయనలో భయం పోలేదు. కానీ.. ప్రెస్ మీట్ లలో విలేరులు ప్రశ్నలు అడుగుతారనే భయం లేకుండా ఆయన ఒక దొంగమార్గాన్ని కనుగొన్నారు. సెలక్టెడ్ విలేకరులను మాత్రమే ఆ భేటీకి పిలుస్తారు. వారికి సకలం సమకూరుస్తారు. తాను చెప్పదలచుకున్నది మొత్తం చెబుతారు. ఆయనకు వ్యతిరేకంగా ఒక్కమాటకూడా బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడతారు. వారెవ్వరూ ఒక్కటైనా ఎదురు మాటాడకుండా, ప్రశ్న అడగకుండా చూసుకుంటారు. ఇక సదరు ఫ్యాబ్రికేటెడ్ ప్రెస్ మీట్ లలో జగన్ చెలరేగిపోతారన్నమాట. ఇది జగన్మోహన్ రెడ్డి న్యూ స్టయిల్ ప్రెస్ మీట్ కల్చర్ గా చెలామణీ అవుతోంది.

జగన్మోహన్ రెడ్డి పరిపాన సాగించిన అయిదేళ్ల కాలంలో ఎన్నడూ ప్రజలను కలిసిన పాపాన పోలేదు. పరదాలు కట్టుకుని ఊర్లలో తిరిగారు. ప్రజలను శత్రువుల్లా చూశారు. తీరా ఎన్నికలు వచ్చాక.. ప్రచారంలో ఊరూరా తిరుగుతూ.. ప్రజలతో భేటీలు ఏర్పాటు చేశారు. వచ్చిన ప్రజలందరూ జగన్ పరిపాలనను వేనోళ్ల కీర్తించి.. ఆయన దయతో తాము బతుకు సాగిస్తున్నట్టుగా చెబుతారు. ఆయన ముసిముసి నవ్వులతో విని, మళ్లీ మన పార్టీ అధికారంలోకి రావాలని వారికి పురమాయిస్తారు. ఇలా జరిగేది. అవన్నీ ఫ్యాబ్రికేటెడ్ ప్రజా సమావేశాలన్నమాట. ఆయన తరఫున ప్రచార బాధ్యలు చూసిన ఐప్యాక్ వారే ఏర్పాటుచేసేవారు. స్క్రిప్టు ఇచ్చిన ప్రజలను మాత్రమే అక్కడ మాట్లాడానికి అనుమతించేవారు. ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ ప్రజల భేటీలు నిర్వహించిన జగన్మోహన్ రెడ్డికి, ఓడిపోయిన తర్వాత.. సొంతంగా ఫ్యాబ్రికేటెడ్ ప్రెస్ మీట్లు నిర్వహించాలనే దురాలోచన పుట్టినట్టుగా కనిపిస్తోంది

Related Posts

Comments

spot_img

Recent Stories