వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి తర్వాత విచ్చలవిడిగా రెచ్చిపోయిన నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తమ చెప్పు చేతల్లో ఉన్నట్లుగా వారు చెలరేగిపోతూ వచ్చారు. తమను ప్రశ్నించేవారు రాష్ట్రంలోనే లేనట్టుగా వారి వ్యవహారాలు సాగాయి. జగన్ తర్వాత తానే నెంబర్ టు అన్నట్లుగా పెద్దిరెడ్డి పెత్తనం చెల్లాయించారు. అక్రమ వ్యాపారాలు, అరాచకాలు దందాలకు లెక్కేలేదు. గరుడ శాఖ తన చేతిలోనే పెట్టుకొని క్వారీలు తవ్వకాలలో యధేచ్చగా దండాలు కొనసాగించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు భయం మొదలైంది. తమ అక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తే ఎన్ని దశాబ్దాలు జైలులోకి పోవాల్సి వస్తుంది అనే భయం వారిని వెన్నాడుతుందా అన్నట్లుగా పెద్దిరెడ్డి దళం ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు. తమ అక్రమ వ్యాపారాలు పై ముసుగులు కప్పుతున్నారు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఇన్నాళ్ల దోపిడీలను కప్పెట్టడానికి ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. అక్రమంగా నడిపిన రోడ్ మెటల్ క్రషర్ ను ఇప్పుడు పెద్దిరెడ్డి దళాలు హడావుడిగా తొలగించే ప్రయత్నంలో ఉండడం గమనార్హం. చిత్తూరుజిల్లాలో తన నియోజకవర్గం పరిధిలోనే పాలెంపల్లి వద్ద పెద్దిరెడ్డి ఒక స్టోన్ క్రషర్ ను ఏర్పాటుచేశారు. అనుమతులున్న ముడిరాయి తెచ్చుకుని ఇక్కడ కంకరగా మార్చి విక్రయించాలి.
కానీ పెద్దిరెడ్డి చేతిలోనే గనుల శాఖ ఉన్నది గనుక.. ఆయన చెలరేగిన తీరు ఆశ్చర్యకరం. ఎందుకంటే.. ఇతరుల లీజు ఉన్న క్వారీల్లో కూడా రాయిని తవ్వేసి తెచ్చుకోవడం, అసలు ఎక్కడా అనుమతులు లేని చోట కూడా రాయిని తవ్వేసి తెచ్చుకోవడం చేశారు. అన్నింటినీ ఈ క్రషర్ లోనే కంకరగా మార్చి.. పెద్దిరెడ్డి దళాలు కాంట్రాక్టర్లుగా వ్యవహరించిన అన్ని రోడ్డు, ఇతర నిర్మాణ పనులకు ఇక్కడినుంచే విక్రయించారు.
ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. తమ అక్రమాలు ఎక్కడ బయటపడతాయో అని పెద్దిరెడ్డి జాగ్రత్త పడుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రభుత్వం దృష్టిసారిస్తే ఈ దందాల్లో అడ్డగోలుగా దొరికిపోతామని, వనరులను దోచుకున్నందుకు తమకు పడే శిక్షలు కూడా పెద్దవిగానే ఉంటాయని పెద్దిరెడ్డి భయపడుతున్నారు.