ఫౌజీ సాలిడ్‌ అప్డేట్‌…వచ్చేది ఎప్పుడంటే..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ప్రస్తుతం భారీ స్థాయిలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు హను రాఘవపూడి పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. ప్రభాస్ ఈ సినిమాలో పూర్తిగా కొత్త లుక్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడని తెలిసింది. ఈ కొత్త లుక్‌పై అభిమానుల్లో ఇప్పటికే పెద్ద ఆసక్తి నెలకొంది.

ఈ ప్రాజెక్ట్ నుంచి కొత్త అప్‌డేట్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తుండగా, తాజాగా దర్శకుడు హను రాఘవపూడి ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను ప్రకటించబోతున్నట్టు ఆయన చెప్పినట్లు సమాచారం. అదే రోజున ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీతాన్ని విశాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories