టాలీవుడ్ స్టార్ హీరో, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇపుడు ఓ పక్క సినిమాలతో మరోపక్క రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ బిజీలో తన భారీ సినిమా “హరిహర వీరమల్లు” మళ్ళీ మొదలు పెడుతుండగా.. ఈ సినిమా తర్వాత “ఓజి” సినిమా మొదలవుబోతుంది.
మరి ఉప ముఖ్యమంత్రి హోదాలో మాత్రం ఫ్యాన్స్ కి సినిమాలని మించిన కిక్ ని తాను అందిస్తున్నాడు అని ఇపుడు తన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. శంకర్ సెన్సేషనల్ హిట్ చిత్రం “ఒకే ఒక్కడు” లో అర్జున్ ఏ రీతిలో అయితే సీజింగ్ లు సస్పెన్సన్ లు లెటర్స్ రాయిస్తాడో దీనిని రియల్ లైఫ్ లో పవన్ చూపిస్తున్నాడు అంటూ పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు.
దీంతో ఇపుడు పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకొందరు అయితే మన సూపర్ స్టార్ మహేష్ బాబు “భరత్ అనే నేను” ఎడిట్స్ చేస్తూ పవన్ “ఓజి” కి మించిన కిక్ ఇస్తున్నాడు అంటూ ఆ వైబ్స్ ని మంచిగా ఖుషీ అవుతున్నారు.