ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ రిలీజ్‌ టైమ్‌ ఫిక్స్!

టాలీవుడ్‌ యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రలో , మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌ గా , డైరెక్టర్‌ పరుశురామ్‌ పర్యవేక్షణలో తెరకెక్కిన చిత్రం ఫ్యామిలీ స్టార్‌. ఈ సినిమాను ఏప్రిల్ 5 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి విడుదల కానుంది. విడుదల తేదీ  సమీపిస్తుండడంతో చిత్ర బృందం ఇప్పటికే ప్రమోషన్స్ కార్యక్రమం ప్రారంభించింది.

ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ ను గురువారం విడుదల చేసేందుకు చిత్ర బృందం టైమ్‌ ఫిక్స్ చేసింది.  గురువారం ఉదయం 11.07 నిమిషాలకు ఈ సినిమా ట్రైలర్‌ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మూడు పాటలు కూడా సూపర్ హిట్‌ గా నిలిచాయి.

విజయ్‌ దేవరకొండ, పరుశురామ్‌ కాంబోలో వస్తున్న ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories