ఫ్యామిలీ స్టార్‌ మలయాళ సినిమా ఎఫెక్ట్‌ అవ్వనుందా!

గత వారం థియేటర్లలోకి విడుదలైన టిల్లు స్క్వేర్ సూపర్‌ హిట్‌ గా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమా థియేటర్స్‌ లో సూపర్‌ ర్యాంపేజ్‌ కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే ఈ వారం కూడా చాలా చిత్రాలు థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ గా ఉన్నాయి. అందులో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్‌.

విజయ్ దేవరకొండ  హీరోగా,  మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా , గీతాగోవిందం దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన చిత్రం ఇది. మన తెలుగు సినిమా ఇది కాగా దీనితో పాటుగా ఆ తరువాత రోజు మళయాళ సెన్సేషనల్ హిట్ చిత్రం “మంజుమ్మల్ బాయ్స్” కూడా థియేటర్లలోకి రానుంది.

ఈ సినిమా మళయాళంలో హిస్టరీ క్రియేట్ చేసి తమిళ నాట కూడా 60 కోట్లకి పైగా వసూళ్ళని రాబట్టి  అందరిని ఆశ్చర్యపరిచింది. దీనితో తెలుగులో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతుంది అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఇది ఫ్యామిలీ స్టార్ కి ఏమన్నా ప్రభావం చూపిస్తుందా అనేది కాస్త ఆందోళన కలిగించే విషయమే మరి.  ఈ సినిమాలు రెండు క్లాష్‌ అయి వసూళ్లను ఎలా రాబడతాయో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories