ఎఫ్‌ 1 కి ఇండియాలో రికార్డు వసూళ్లు!

ఈ ఏడాది హాలీవుడ్ నుంచి కంటెంట్ బేస్డ్ సినిమాలు వరుసగా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సూపర్ హీరోలు లేకపోయినా, పెద్ద ఫ్రాంచైజీలు కాకపోయినా మంచి కథాంశంతో వచ్చిన చిత్రాలకు మన దేశంలోనూ ఆదరణ కనిపిస్తోంది. అలాంటి చిత్రాల్లో తాజాగా మనకు అందిన సినిమా “ఎఫ్ 1”.

బ్రాడ్ పిట్ కీలక పాత్రలో నటించిన ఈ రేసింగ్ థ్రిల్లర్ విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ స్పందన అందుకుంది. ఆకర్షణీయమైన విజువల్స్, రేసింగ్ నేపథ్యంలో ఉండే థ్రిల్‌కి థియేటర్‌లో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతే కాదు, భారత్‌లోనూ ఈ సినిమా వసూళ్ల పరంగా బలంగా నిలిచింది.

తాజాగా ఈ సినిమా ఇండియా బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటింది. ఇది సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే ఇది మార్వెల్ మూవీ కాదు, గతంలో దేని సీక్వెల్ కూడా కాదు. పూర్తిగా కొత్త కథతో వచ్చినా కూడా మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో ఈ సినిమా తేల్చి చెప్పింది.

ఈ చిత్రానికి దర్శకుడిగా జోసెఫ్ కొన్సిస్కి పని చేశారు. బ్రాడ్ పిట్‌తో పాటు డామ్సన్ ఐడ్రిస్ అనే యంగ్ యాక్టర్ కూడా సినిమాలో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్‌గా ఈ సినిమా వసూళ్లు ఇంకెంతవరకు వెళ్తాయో చూడాలి కానీ, ఇప్పటిదాకా వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఈ రేస్ థ్రిల్లర్ హాలీవుడ్ బాక్సాఫీస్ కాకుండా ఇండియన్ మార్కెట్‌లోనూ హిట్ ట్రాక్‌లో దూసుకెళ్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories