ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ కి అదిరిపోయే న్యూస్‌..ఆ స్పెషల్‌ డే నాడు!

టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాస్‌ యాక్షన్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబోలో రాబోతున్న చిత్రం దేవర. ఈ సినిమాలో ఆలనాటి నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ కథానాయికగా తెలుగు తెరకు పరిచయం అవుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్‌, టాలీవుడ్‌ ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ ఏడాది దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇంతకు ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే… ఈ సినిమా నుంచి అప్డేట్స్‌ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా, మూవీ మేకర్స్‌  దేవర గురించి అప్డేట్ ఇస్తూ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ ను విడుదల చేశారు. తొందరలో దేవర ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.

అంతేకాకుండా సెలబ్రేషన్స్, కేక్ ఎమోజీలను కూడా షేర్ చేశారు. అయితే మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ పోస్ట్ చూసిన యంగ్‌ టైగర్‌ అభిమానులు తెగ సంతోషపడుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories