మెగా ఫ్యాన్స్‌ కి అదిరిపోయే న్యూస్‌!

గ్లోబల్‌ స్టార్ రామ్‌ చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా గేమ్‌ ఛేంజర్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమాను కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పొలిటికల్ యాక్షన్‌ పాన్ ఇండియా ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

బుధవారం చరణ్ బర్త్‌ డే సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్‌ సాంగ్‌ విడుదలై అప్పుడే మంచి టాక్ ని అందుకుంది. సాంగ్‌ విడుదల కావడంతో సినిమా విడుదల గురించి అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి విడుదల తేదీ ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 31న వరల్డ్‌ వైడ్‌ గా గ్రాండ్ గా రిలీజ్‌ చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

త్వరలో దీనికి సంబంధించిన విషయం గురించి చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం.

Related Posts

Comments

spot_img

Recent Stories