బన్నీ అభిమానులకు అదిరిపోయే న్యూస్‌!

సైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రధాన పాత్రలో నటించి మెప్పించిన చిత్రం పుష్ప. అది భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్‌ పుష్ప 2 కూడా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల గురించి మేకర్స్‌ మంగళవారం పెద్ద అప్డేట్ ను విడుదల చేశారు. బన్నీ పుట్టిన రోజు సందర్బంగా ఏప్రిల్‌ 8 న   ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ ను విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్‌ ప్రకటించారు. ఈ విషయాన్ని ఓ పవర్‌ ఫుల్‌ పోస్టర్‌ ద్వారా చిత్ర బృందం వెల్లడించింది.

విడుదలైన ఈ పోస్టర్‌ ఆడియెన్స్‌ ను, అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. జాతరలో బన్నీ వేషదారణకు సంబంధించిన పోస్టర్‌ అది. కేవలం ఓ కాలు మాత్రమే కనిపించేలా పోస్టర్‌ ను విడుదల చేశారు. ఇది బన్నీ అభిమానులకు మాస్‌ పండగ అనే చెప్పాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories