ఆ మూడూ తప్ప అన్ని ఎంపీలూ కూటమికే!

ఏపీలో అసెంబ్లీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే విషయంలో పార్టీలు తమ తమ ధీమాను తాము వ్యక్తం చేస్తున్నాయి. గత ఎంపీ ఎన్నికల్లో 22 స్థానాలు సాధించిన జగన్మోహన్ రెడ్డి ఈసారి తమకు అంతకంటె ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయని, ఐప్యాక్ వారితో భేటీలో ప్రకటించారు కూడా. వాస్తవ పరిస్థితులు కూడా అంతేనా? భిన్నంగా ఉండబోతున్నాయా? కమలం పార్టీకి చెందిన కొందరు సీనియర్ విశ్లేషకుల అంచనాల ప్రకారం.. ఏపీలో ఎన్డీయే కూటమికి ఈ దఫా 22 ఎంపీ స్థానాలు దక్కబోతున్నట్టుగా తెలుస్తోంది. ఒకటిరెండు స్థానాలు మహా అయితే మైనస్ కావొచ్చు.

ఏపీలో అరకు ఎంపీ సీటు కూటమి చేజారనుంది. అలాగే తిరుపతి, రాజంపేట రెండు ఎంపీ నియోజకవర్గాల్లో వారు ఒకటి మాత్రమే నెగ్గుతారనే అంచనాలు ఏర్పడుతున్నాయి. అదే విధంగా కడప సీటును కూడా కూటమి కోల్పోనుంది. అయితే ఇక్కడ ఇంకో ట్విస్టు కూడా ఉంది. కడప సీటును కూటమి కోల్పోయినంత మాత్రాన అది వైసీపీ ఖాతాకు చేరుతుందనే నమ్మకం లేదు. అక్కడ వైఎస్ షర్మిల రెడ్డి గెలిచినా కూడా ఆశ్చర్యం లేదని వారు అంటున్నారు.

జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో 22 ఎంపీ సీట్లు సాధించారు. తెలుగుదేశం కేవలం 3 సీట్లకు పరిమితం అయింది. అయితే తనకు మెజారిటీ ఎంపీసీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా తెస్తానని ప్రకటించిన జగన్, గెలిచిన తర్వాత ఆ విషయం పూర్తిగా పక్కన పడేశారు. కేంద్రం వద్ద సాగిలపడ్డారు. హోదాను పట్టించుకోకుండా మంటగలిపేశారు. తీరా ఈ ఎన్నికలకు ముందు.. తమ బలం మీద ఆధారపడే బిజెపి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడే పరిస్థితి వస్తే హోదా సాధిస్తానంటూ కొత్త పాట ఎత్తుకున్నారు. ఇలాంటి మాయమాటలకు లొంగకుండా ప్రజలు స్పష్టమైన తీర్పు చెప్పినట్టు సమాచారం. ఈసారి ఏకంగా 22  సీట్లు కూటమికే దక్కనున్నాయి. రెండు లేదా మూడు సీట్లు వైసీపీకి దక్కబోతున్నాయి. కాంగ్రెస్ కు ఒకటి గెలిచే చాన్సుంది.. అని వారి అంచనాలు చెబుతున్నాయి.

ఇది పార్టీ అధికారికంగా ప్రకటిస్తున్న అంచనాలు కాదు. అంతర్గతంగా సమాచారం కోసం పెద్దలు సేకరించిన వివరాల ప్రకారం అంచనాలు. ఇవి వాస్తవానికి దగ్గరగానే ఉంటాయనే ఆ పార్టీలో పలువురు పేర్కొంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories