పక్కా ప్లానింగ్‌ ప్రకారమే!

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాట్రిక్ సెన్సేషనల్ హిట్ చిత్రం “అఖండ” కోసం అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా దగ్గర ఒక బిగ్గెస్ట్ హిట్ అయ్యిన సినిమాల్లో భారీ లాంగ్ రన్ ని ఈ చిత్రం చూసింది. అయితే దీనికి సీక్వెల్ గా మేకర్స్ “అఖండ 2 తాండవం”ని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఓ ఇంట్రెస్టింగ్ టాక్ దీనిపై ఇపుడు వినిపిస్తుంది. దీని ప్రకారం అఖండ 2 షూటింగ్ ని మేకర్స్ పక్కా ప్లానింగ్ గా కంప్లెట్ చేస్తున్నారట. పార్ట్ 1 లో బాలయ్య డ్యూయల్ రోల్ లో చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇవి పార్ట్ 2 లో కూడా కొనసాగనున్నాయి. అయితే మొదటిగా మేకర్స్ అఘోర గెటప్ లో టాకీ పార్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేసేస్తున్నారట.

ఇక ఇది అయ్యాక బాలయ్య లోని మరో షేడ్ షూటింగ్ ని మొదలు పెట్టనున్నారట. ఈ షూటింగ్ తో జూన్ నాటికి మొత్తం సినిమాని పూర్తి చేసేయాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. దీనితో అఖండ 2 మాత్రం అనుకున్నట్టు గానే సెప్టెంబర్ రిలీజ్ కి రానుందట. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories