అమరావతిపై పైశాచిక శక్తుల వికృతక్రీడ!

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటినుంచి విధ్వంసరచనే తమ బాటగా పరిపాలన సాగిస్తూ వస్తోంది. చంద్రబాబు నివాసం పక్కనే ఉన్న ప్రభుత్వ ఆస్తి ప్రజావేదికను కూలగొట్టడంతోనే జగన్ పరిపాలన ప్రారంభం అయింది. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నాయకుల ఆస్తులను కూలగొట్టడం తమ నిర్దిష్టమైన ఎజెండాగా ఎంతెంతగా చెలరేగిపోయారో లెక్కేలేదు. ప్రత్యర్తులు కాకుండా, ప్రభుత్వ ఆస్తులను కూడా విచ్చలవిడిగా నాశనం చేస్తూ వచ్చారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వపు ముద్ర ఉంటే చాలు.. దానిని ధ్వంసం చేయడమే. వారి వికృత పైశాచిక ఆనందానికి చిట్టచివరిది ఇదేనా అన్నట్టుగా.. తాజాగా అమరావతి రాజధాని ప్రాంతంలో ఉద్ధండరాయనిపాలెం వద్ద ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో అమరావతి నగర నమూనా గ్యాలరీను ఆనవాళ్లు కూడా తెలియకుండా సర్వనాశనం చేసేశారు.


అమరావతి అనే పేరుతో ఉన్న బోర్డును కూడా ధ్వంసం చేశారు. దుండగులు అక్కడే మద్యం తాగి సీసాలు అన్నీ అక్కడే పడవేసిన ఆనవఆళ్లు కూడా కనిపిస్తున్నాయి. రాజధాని గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిమిత్తం గుంటూరు ఎంపీ తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటిస్తున్న సందర్భంగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఒక ఆహ్లాదకరమైన పర్యటక ప్రదేశంలాగా అభివృద్ధి చేశారు. రాజధాని రాష్ట్రం మొత్తం యొక్క భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతో.. 16వేల గ్రామాల్లోని మసీదులు, చర్చిలు, ఆలయాల ప్రదేశాల నుంచి నీరు, మట్టి సేకరించి ఆ ప్రాంతంలో ఉంచారు. అంతేకాకుండా ప్రధాని మోడీ వస్తూ మట్టి నీరు తెచ్చి శంకుస్థాపన  ప్రాంతంలో ఉంచారు. పలురాష్ట్రాలనుంచి పెద్దసంఖ్యలో సందర్శకులు ఇక్కడకు వస్తుండేవారు.

అమరావతి రాజధాని నగరాన్ని 217 చదరపు కిలోమీటర్ల మేర ఏ రకంగా అయితే 32 పెద్ద రోడ్లతో అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం డిజైన్ చేశారో.. అలాంటి ఒక నమూనా మోడల్ ను అక్కడ ఏర్పాటు చేశారు. టీడీపీ సర్కారు అక్కడ 24 గంటల పాటూ ఉండే సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. వైసీపీ సర్కారు రాగానే సెక్యూరిటీని తొలగించింది. ఆ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. తాజాగా అరాచక శక్తులు ఆ మోడల్ సహా, అమరావతి అనే బోర్డు తో సహా అక్కడ అంతా ధ్వంసం చేసేశారు. జగన్ అమరావతి రాజధాని ఆలోచనను చంపేస్తే, ఆయన తైనాతీలు మోడల్ ను కూడా ధ్వంసం చేశారని ప్రజలు చీదరించుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories