అంతా కుదిరినట్లేనా…!

ఇండియన్ సినిమా దగ్గర ప్రైడ్ దర్శకుల్లో మావెరిక్ డైరెక్టర్‌ శంకర్ కూడా ఒకరు. తాను చేసిన సినిమాలు కొన్నే అయినప్పటికీ తాను వేసుకున్న ముద్ర మాత్రం ఓ రేంజ్‌ లో ఉంది. బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ తోనే కాకుండా… నార్మల్ హీరోస్ తో కూడా రికార్డు బాక్సాఫీస్ నంబర్స్ సెట్ చేసిన స్టాండర్డ్స్ శంకర్ కి ఉంది. అయితే అలాంటి దర్శకుడు డౌన్ ఫాల్ అనేది చాలా బాధాకర అంశమే.

కానీ ఎట్టకేలకి మళ్ళీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేసిన ‘గేమ్ ఛేంజర్’ తో మళ్ళీ తానేంటో నిరూపించుకున్నాడు. మరి ఈ సినిమా సమయంలోనే కమల్ హాసన్ తో చేసిన భారీ సినిమా ఇండియన్ 2 అలాగే ఇండియన్ 3లు కూడా లైన్లో ఉన్నాయి. అనుకోని విధంగా ఇండియన్ 2 డిజాస్టర్‌ గా నిలిచింది.

 అయినప్పటికీ గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్స్ లో శంకర్ ఇండియన్ 3 థియేటర్స్ లోనే విడుదల ఉంటుందని తేల్చి చెప్పారు. కానీ గేమ్ ఛేంజర్ ముందు మాత్రం లైకా వారు ఇబ్బందులకు గురి చేశారు. ఆ సమయంలో గేమ్ ఛేంజర్ ఒకేలా హిట్ అయితే అది ఇండియన్ 3కే ప్లస్ అవుతుంది అని చాలా కామెంట్లు వినపడ్డాయి.

గేమ్ ఛేంజర్ విడుదల ఇండియన్ 3 కి మంచి బజ్ తీసుకురావచ్చనే టాక్ వినపడుతుంది. సో ఫైనల్ గా గేమ్ ఛేంజర్ కి ఇపుడు మంచి రెస్పాన్స్ అందుకుంది. సో ఇండియన్ 3కి ఇది ఎంతమేర ప్లస్ అవుతుంది అనేది చూడాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories