ఆయుధ పూజకు అంతా రెడీ!

ప్రస్తుతం టాలీవుడ్‌లో ది మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదైనా ఉంది అంటే అది  ‘దేవర’ నే.  ప్రస్తుతం ఈ మూవీ మేనియా దేశమంతా కొనసాగుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ప్రేక్షకులు బాగా అదరిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్, ట్రైలర్స్ మాసివ్ రెస్పాన్స్‌ను కూడా దక్కించుకున్నాయి.

అటు సాంగ్స్ కూడా ఈ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. అయితే, ఈ సినిమాలో ‘ఆయుధ పూజ’ సాంగ్ ఉంటుందని.. అది సినిమాకే హైలైట్ కాబోతుందని సినిమా బృందం చెబుతూ ఉంది. ఇప్పుడు ఈ పాటకు సంబంధించి మరో అప్డేట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు లిరిసిస్ట్ రామ జోగయ్య శాస్త్రి. దేవర వరల్డ్‌వైడ్ థియేట్రికల్ విడుదలకి రెండు వారాల సమయం ఉంది.

అయితే, వచ్చే వారంలో ‘ఆయుధ పూజ’ సాంగ్ రానుందని.. ఇది పాన్ ఇండియా బిగ్గెస్ట్ బ్లాస్ట్ అవుతుందని ఆయన తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్‌లో రాసుకొచ్చారు. దీంతో ‘ఆయుధ పూజ’ ట్రాక్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో అప్పుడే మొదలు అయిపోయింది.

ఇక ఈ సినిమాకు అనిరుధ్ అందించిన సంగీతం నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే చాలా సార్లుచెప్పింది. మరోసారి నిజం చేయబోతుంది. మరి ‘ఆయుధ పూజ’ సాంగ్ ట్రాక్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు వస్తుందో వెయిట్‌ చేయాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories