ప్రతిపక్షంలో ఉన్న కూడా.. వారు పెట్టుబడులకు రాహు కేతువులే!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న అయిదేళ్ల కాలంలో రాష్ట్రం నుంచి ఎన్ని పరిశ్రమలను వెళ్లగొట్టారో అందరికీ తెలుసు. రాష్ట్రంలో నెలకొల్పడానికి ఒప్పందాలు చేసుకున్న, ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్న పారిశ్రామిక సంస్థలను కూడా వైసీపీ నాయకులు బెదరగొట్టి.. దందాలతో భయపెట్టి, రాజకీయ కక్షలతో వేధించి.. మొత్తానికి రాష్ట్రంనుంచి పారిపోయేలా చేశారు. కొత్త పారిశ్రామికవేత్తలు అసలు రాష్ట్రంవైపు చూడాలంటేనే భయపడే పరిస్థితిని కల్పించారు. అన్ని దుర్మార్గాలకు పాల్పడిన వైఎస్సార్ కాంగ్రెస్ దళాలు.. ఇప్పుడు ప్రతిపక్షంగా అత్యంత దయనీయమైన స్థితిలో కేవలం 11 సీట్లకే పరిమితై ఉన్నప్పటికీ.. ఇప్పటికే అదే రాహుకేతువుల పాత్రను పోషిస్తున్నారు. రాష్ట్రంలో ఏర్పాటు కావడానికి సిద్ధమవుతునవ్న పరిశ్రమలను గ్రహణం పట్టే రాహుకేతువుల్లా వారు మింగేస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో వైఎస్ జగన్ పరిపాలన సాగిన రోజుల్లో క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలను ప్రోత్సహించి విచ్చలవిడిగా దోచుకున్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్దనరెడ్డి ఇప్పుడు రిమాండులో జైలుశిక్ష అనుభవిస్తున్నది కూడా ఆ కేసుల వల్లనే. ఇదే కేసుల్లో మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా నిందితుడు. వీరిద్దరూ కూలిసి తాము స్వయంగా అక్రమ తవ్వకాలు జరిపించడమే కాకుండా.. నెల్లూరు జిల్లానుంచి క్వార్ట్జ్ తవ్వి ఎక్స్ పోర్ట్ చేసే ప్రతి ఒక్కరి నుంచి దందాలు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. వీరు దోచుకున్న వందల కోట్లలో నెలకు రూ.20 కోట్ల వంతున 9 నెలల పాటు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా పంపినట్టు ఆరోపణలున్నాయి. కాగా.. అనిల్ యాదవ్.. కౌంటర్లు ఇస్తూ తెలుగుదేశానికి చెందిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి మీదనే నానా నిందలు వేశారు. ఆయన క్వార్ట్జ్ తవ్వకాల్లో అక్రమాలు చేస్తున్నారని అన్నారు.  దోచుకుంటున్నారని ఆరోపణలు చేశారు.
దీంతో విరక్తి చెందిన వేమిరెడ్డి.. నెల్లూరు జిల్లా నుంచి నాణ్యమైన క్వార్ట్జ్ ఖనిజం చైనాకు ఎగుమతి చేయడం మాత్రమే కాకుండా.. ఇక్కడే 400  కోట్ల రూపాయలతో ఫ్యాక్టరీ ఏర్పాటుచేసి వెయ్యి మందికి ఉపాధి కల్పించాలని అనుకున్నానని, తనమీదనే దోచుకున్నట్టుగా నిందలు వేస్తుండడంతో ఆ కంపెనీ ఏర్పాటు ఆలోచన మానుకుంటున్నానని ప్రకటించేశారు.

నెల్లూరులో దొరికే క్వార్జ్జ్ ను చైనాలో హైప్యూరిటీ క్వార్ట్జ్ శాండ్ గా మారుస్తారు. మన వద్ద అలాంటి పరిశ్రమలు లేవు. ఆ పరిశ్రమ ఏర్పాటుచేసి ఇక్కడివారికి ఉపాధి కల్పించాలని అనుకున్నాను. దీనికోసం ఒక బృందాన్ని కొంత శాంపిల్స్ ను చైనాకు పంపి అధ్యయనం చేయించానని తన మీద నిందలు వేయడంతో ఆ ప్రతిపాదన మానుకుంటున్నానని అన్నారు. లక్ష్మి క్వార్ట్జ్, ఫిని క్వార్ట్జ్ పేరుతో ఏర్పాటు చేసిన కంపెనీలను విరమించుకుంటున్నట్టు ప్రకటించారు. ఇది బాధతో తీసుకుంటున్న నిర్ణయం అని చెప్పారు. తన కంపెనీల మొత్తం టర్నోవర్ లో క్వార్ట్జ్ ఎగుమతులు వాటా చాలా తక్కువ అని తనమీద నిందలు వేయడం బాధించిందని అన్నారు.

వేమిరెడ్డి తన పరిశ్రమ ఏర్పాటు ఆలోచన మానుకోవడం గమనిస్తేవ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుకేతువుల వంటి నాయకులు.. తాము ప్రతిపక్షంలో ఉన్నా సరే.. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు కాకుండా అడ్డుకోగలరని, రాష్ట్ర అభివృద్ధికి గ్రహణంలా పట్టగలరని ప్రజలు భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories