కాఫీ దుకాణం మీదకూడా కంపు రాజకీయం!

‘అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు..’ అని తెలుగులో ఒక సామెత ఉంటుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు ఇప్పుడు వెలిబుచ్చుతున్న ఆవేదన గమనిస్తే అచ్చంగా ఆ సామెత గుర్తుకు వస్తోంది. ఎంపీలుగా ఏదో పార్లమెంటు అటెండన్సు రిజిస్టరులో సంతకాలు చేయడానికి ఉన్నారే తప్ప.. నిర్దిష్టంగా తమ పాత్ర పోషించి.. తమ ప్రాంతానికి మేలుచేసేవారు, తమ ప్రజల సమస్యలను తీర్చడానికి ఉద్యుక్తులయ్యేవారు చాలా తక్కువ. అలాంటిది ఇప్పుడు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పూనిక వహించి.. రాష్ట్రంలో విలక్షణమైన పంటగా సాగయ్యే ప్రత్యేకమైన అరకు కాఫీ యొక్క అస్తిత్వాన్ని దేశానికి తెలియజేయడానికి పార్లమెంటు ఆవరణలో కాఫీ స్టాల్ ఏర్పాటు చేయిస్తే.. దానిమీద కూడా వైసీపీ ఎంపీలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మెటికలు విరుస్తున్నారు. కాఫీ స్టాల్ ఓపెనింగ్ కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని అరకు ఎంపీ వైసీపీకి చెందిన తనూజారాణి ఆవేదన వ్యక్తం చేయడం తమాషాగా ఉంది. ఈ అంశంపై పార్లమెంటు స్పీకరుకు ఫిర్యాదు చేస్తానని అనడం.. ఏదో స్కూలు పిల్లల వ్యవహారంలాగా ఇంకా తమాషాగా కనిపిస్తోంది.

అయినా ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని సామెత. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్షహోదా ఇవ్వలేదని అలకపూని అసెంబ్లీకి వెళ్లకుండా ప్యాలెస్ లలో గడుపుతున్నారు. అలా అలిగే నాయకుడు ఉండగా.. కాపీ షాపు ఓపెనింగ్ కు పిలవలేదని ఆయన పార్టీ ఎంపీ అలగడంలో వింతేముంది.
ఎంపీ తనూజారాణి మరో ఇద్దరు ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, గొల్ల బాబూరావులతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. అరకు కాఫీస్టాల్ ఓపెన్ చేస్తూ.. అరకు ఎంపీ అయిన తనను పిలవలేదని, అవమానించారని అన్నారు. పైగా తాను గిరిజన ఎంపీ కావడం వల్లనే ఇలా అవమానించారంటూ కులం కూడా ఆ విమర్శలకు జోడించారు. స్పీకరుకు ఫిర్యాదు చేస్తానన్నారు.

‘‘అరకు కాఫీకి అంతర్జాతీయ ఖ్యాతి ఉంది. అటువంటి కాఫీస్టాల్‌ను పార్లమెంట్‌లో ప్రారంభించే సందర్బంగా కనీసం అరకు ఎంపీగా ఉన్న నాకు ఆహ్వానం వస్తుందని ఆశించాను. అలాగే కనీసం కాఫీగింజలను పండించే పదిమంది గిరిజన రైతులను ఈ కార్యక్రమానికి పిలిస్తే, అద్భుతమైన ఈ కాఫీ రుచుల వెనుక వారి శ్రమ ప్రపంచానికి తెలిసేది. అరకుకే ప్రత్యేకమైన గిరిజన థింసా నృత్యాన్ని కూడా ఈ సందర్భంగా ప్రదర్శించి వుంటే జాతీయ స్థాయిలో గిరిజన సంస్కృతికి ఒక పరిచయ వేదికగా మారేది. అరకు అంటే కేవలం కాఫీ మాత్రమే కాదు, సహజసిద్దమైన ఔషధగుణాలు ఉన్న పసుపు, అరుదైన సుగంధద్రవ్యాలు కూడా. ఇవ్వన్నీ పార్లమెంటేరియన్‌లకు పరిచయం చేసే సందర్భంగా ఆ కాఫీస్టాల్ ప్రారంభోత్సవం ఉండేది’’  అంటూ తనూజారాణి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇలా చేసి ఉండాలి.. అలా చేసి ఉండాలి అంటున్నారు.

ఈ డైలాగులన్నీ వల్లించేముందు.. అయిదేళ్లు పరిపాలన సాగించిన తమ జగనన్న ఇలాంటి పని అసలు ఎందుకు చేయలేకపోయారో.. ఆమె అడగాలి కదా! అరకు కాఫీ కి ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకువచ్చిన వ్యక్తి చంద్రబాబు మాత్రమే. జగన్ తన అరకు ప్రాంతానికి అలాంటి ఏ గౌరవమైనా సంపాదించారా? అనేది ఆమెకు తెలుసా..? ఆమె పార్టీ అసలు ఏమీ చేయకపోగా.. పనిచేసే వారిలో లోపాలు వెతకడం అనేది తనూజారాణి వంటి వన్ టైం లీడర్లకు ఒక ఫ్యాషన్ గా మారిపోయిందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories