ఈ సినిమా కోసం నా చెప్పులు కూడా ఆరిగిపోయాయి!

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ తాజాగా నటించిన కల్కి 2898 ఏడీ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి రికార్డులు సృష్టిస్తుంది. ప్రభాస్‌ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన  సినిమా లవర్స్‌ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో ప్రభాస్‌ తో పాటు ఇతర నటీనటుల నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌ ఎంతో అద్భుతంగా ఉన్నాడు.

ఇక సినిమా విడుదల అయిన కొద్ది గంటలకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ తన సోషల్ మీడియా ఖాతాలో సినిమా కోసం పడ్డ కష్టాన్ని ఒకే ఒక్క పోస్ట్ ద్వారా వివరించాడు. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీలో అరిగిన, విరిగిన చెప్పుల ఫోటోను పంచుకున్నారు. ఈ సినిమా ఎంతో సుదీర్ఘ ప్రయాణం. ఈ సినిమా చేయడానికి చాలా సంవత్సరాలు కష్టపడ్డామని పేర్కొన్నాడు.

దీంతో నాగ్ అశ్విన్ పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవ్వగా.. దీన్ని చూసిన నెటిజన్స్ డైరెక్టర్ డెడికేషన్ చూసి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. అంతేకాకుండా నాగ్ అశ్విన్ ను ఇండియన్ సినిమాకి ఫ్యూచర్ హాలీవుడ్ డైరెక్టర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం మూవీ టీమ్ అంతా నాలుగేళ్లు కష్టపడ్డారు. సుమారు రూ. 600 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో దీపికా పదుకొణె, కమల్‌హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. మొదటి ఆట నుంచే పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ మూవీ తొలిరోజు రూ.90-100 కోట్ల వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని టాక్‌ వినిపిస్తుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories