బిడ్డ చచ్చినా పురిటి వాసన పోలేదు!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఓటమి తప్పలేదు కానీ, అహంకారం మాత్రం దిగలేదు. ఎన్నికలలో ఓడిపోయినా సరే తమకు అధికార అలంకారమైన ప్రోటోకాల్ మర్యాదలు ఎప్పటిలాగే ఉండాలని వారు కోరుకుంటున్నారు. అందుకు రకరకాల సాకులు చెబుతున్నారు.  ఇందుకు ఉదాహరణ లాగా తన గన్ మేన్ లను తగ్గించడాన్ని మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు హైకోర్టులో సవాలు చేశారు.

అంబటి రాంబాబు మంత్రిగా ఉన్న రోజుల్లో ఆయనకు ఫోర్ ప్లస్ ఫోర్ పోలీసు భద్రత ఉండేది. ఇటీవల ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయిన తర్వాత ప్రభుత్వం సహజంగానే ఆ భద్రతను తగ్గించింది. అంబటి రాంబాబు ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తి మాత్రమే. అయితే తన చుట్టూ గన్ మేన్ లు కనిపించకపోతే.. ఆయనకు చాలా అవమానంగా అనిపిస్తున్నదో.. లేదా ప్రజలు తనను పట్టించుకోరని, పూచికపుల్లలా తీసి పారేస్తారని అనుకుంటున్నారో తెలియదు గానీ.. ఆ మర్యాద మాత్రం కోరుకుంటున్నారు. తనకు ప్రాణహాని ఉన్నదని గతంలో కల్పించిన ఫోర్ ప్లస్ ఫోర్ పోలీస్ భద్రతను పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ అంబటి రాంబాబు ఈ పిటిషన్ వేశారు.

సరైన కారణాలు లేకుండా ప్రాణహాని ఉంది పోలీసు భద్రత కావాలి అని దారిన పోయే దానయ్య ప్రతి ఒక్కడూ అడగడం మొదలెడితే రాష్ట్రంలో ఉండే పోలీసు యంత్రాంగం మొత్తం సరిపోదు. అంబటి రాంబాబుకు ప్రాణహాని ఎందుకు ఉన్నదని ఆయన భావిస్తున్నారో ప్రజలకు అర్థం కాని సంగతి. ఏ రూపంలో ప్రాణహాని ఉన్నదని ఆయన అంచనా వేస్తున్నారో తెలియదు. ఆయనేమీ ఉగ్రవాద వ్యతిరేక నాయకుడిగా ముద్ర పడిన వ్యక్తి కూడా కాదు.
రాజకీయ కక్షలు కార్పణ్యాలు ఉంటే ఉండవచ్చు గా,క కానీ రాజకీయ తగాదాలలో ఇన్వాల్వ్ అయినవారికి, వ్యక్తిగత గొడవలతో రౌడీషీటర్లుగా చలామణి అవుతున్న వారికి కూడా ప్రాణహాని ఉంటుంది. వారందరికీ పోలీసులు భద్రత కల్పించాలంటే ఎలా కుదురుతుంది? ఈ కనీస లాజిక్ గురించి అవగాహన లేకుండా అంబటి రాంబాబు- తాను ఎమ్మెల్యేగా కూడా నెగ్గలేకపోయినా ప్రజాభిమానాన్ని పొందలేకపోయినా.. మామూలు వ్యక్తిగా మిగిలిన సంగతి గుర్తు రాకుండా ఫోర్ ప్లస్ ఫోర్ భద్రత కావాలని అడగడం చాలా అతిశయంగా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories