సగం టార్గెట్ రీచ్ అయినా మహాద్భుతమే!

చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోభివృద్ధిలో ఎన్నడూ లేనంత గుణాత్మకమైన మార్పు చూపించాలని తపన పడుతున్నారు. నిర్మాణాత్మక కార్యక్రమాల విషయంలో ప్రభుత్వం ఇప్పటికే ఎంత ముందంజలో ఉన్నదో అందరికీ తెలుసు. అమరావతి రాజధాని నిర్మాణ పనులు మొదలు కాబోతున్నాయి. అమరావతికి రైల్వేలైను కూడా మంజూరైంది. పోలవరం పనులు జనవరిలో ప్రారంభం అయితే.. ఈ అయిదేళ్లు పదవీకాలంలోనే తుదిదశకు వచ్చే అవకాశం కూడా ఉంది. రైల్వేజోన్ కు డిసెంబరులోనే పునాది పడనుంది. ఇలాంటి నేపథ్యంలో.. కేవలం ఇలాంటివి మాత్రమే కాకుండా.. రాష్ట్రంలోని యువతరానికి విస్తృతంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కూడా చంద్రబాబునాయుడు చాలా గొప్ప కసరత్తు చేస్తున్నారు. ఈ అయిదేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించాలనేది టార్గెట్ గా ప్రభుత్వం నిర్ణయించుకోవడం ఒక అద్భుతం.

రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు సూచనలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక మంత్రుల కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీకి మానవ వనరులు, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. కమిటీలో ఇంకా మంత్రులు టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేశ్, పి.నారాయణ, కొండపల్లి శ్రీనివాస్ లు క ూడా ఉంటారు. భిన్న రంగాల్లో ఉద్యోగాల కల్పనకు గల అవకాశాలను పరిశీలించి, అందుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ కమిటీ సూచిస్తుంది.

ప్రెవేటు రంగంలో రాబోయే అయిదేళ్లలో విస్తారంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఐటీ రంగంలో దక్షిణాదిలోనే నెంబర్ వన్ గా ఏపీని తీర్చిదిద్దడానికి ఒకవైపు ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే పలు ఐటీ, ఎలక్ట్రానిక్ సంస్థలతో సంప్రదింపులు జరపడం ద్వారా.. వారి ప్రాజెక్టులను ఏపీలో ప్రారంభించేలా నారా లోకేష్ అంగీకారం తీసుకుని ఉన్నారు. విశాఖ ఐటీ హబ్ గా మారనుంది. నారా లోకేష్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తూ.. ఏపీకి వివిధ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రతిరోజూ అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఇన్ని ప్రయత్నాలు జరుగుతుండగా.. 20 లక్షల ఉద్యోగాల కల్పన అనేది ప్రభుత్వం నిర్ణయించుకున్న టార్గెట్ కాగా.. అందులో కనిసం సగం టార్గెట్ రీచ్ అయినా సరే.. బాబు సర్కారు ఒక మహాద్భుతాన్ని సృష్టించినట్టే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయిదేళ్లు పదవీకాలంలో ప్రభుత్వ, ప్రెవేటు రంగాల్లో కలిపి పదిలక్షల ఉద్యోగాలు రావడం అంటూ జరిగితే.. యువతరం చంద్రబాబునాయుడుకు నీరాజనం పడుతుందని అంతా అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories