భారీ టార్గెట్ తో రంగంలోకి పెద్ది!

ఇప్పటివరకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా “పెద్దీ”పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. గతంలో వచ్చిన గేమ్-చేంజర్ లాంటి ఫెయిల్యూర్ తర్వాత కూడా సినిమా పట్ల మంచి హైప్ నెలకొనడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

అమెరికా మార్కెట్ నుంచి కూడా పెద్ద బిజినెస్ అవకాశాలు వస్తున్నట్టు వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో “పెద్దీ” అక్కడ 8 మిలియన్ డాలర్లు దాకా వసూళ్లను సాధించే లక్ష్యంతో ముందుకు పోతుందనేది టాక్. సంగీతం ఏ ఆర్ రెహమాన్ అందించడం, శివ రాజ్ కుమార్, దివ్యెందు శర్మ, జగపతిబాబు వంటి ప్రముఖులు నటించడం ఈ సినిమాకు అదనపు బలాన్ని ఇస్తుంది. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చ్ 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories