మోలీవుడ్ సినిమా బిగ్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “ఎంపురాన్”. దర్శకుడు అలాగే నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ఈ చిత్రం మళయాళ సినిమా దగ్గర భారీ హైప్ నడుమ రిలీజ్ కి వచ్చింది. అయితే పలు కాంట్రవర్సీలు కూడా ఈ చిత్రం ఎదుర్కొంది కానీ ఈ కాంట్రవర్సీలు కూడా ఉన్నప్పటికీ ఎంపురాన్ రికార్డు వసూళ్లతో కొత్త ఇండస్ట్రీ హిట్ గా అవతరించింది.
గత ఏడాది మళయాళ సినిమా దగ్గర వచ్చిన పలు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి భారీ వసూళ్లు అందుకొని కొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలవగా ఆ అన్ని సినిమాల వసూళ్ళని ఎంపురాన్ కేవలం 10 రోజుల్లోనే క్రాస్ చేసి కొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ 10 రోజుల్లో ఎంపురాన్ చిత్రం ఏకంగా 250 కోట్లకి పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనితో పృథ్వీ రాజ్ సుకుమారన్ సహా ఇతర చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.