ఉద్యోగులు బాబుపై అభిమానం దాచుకోవడం లేదు!

ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగులు ఓట్లు వేసే ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభం అయింది. అలాగే వృద్ధులు వికలాంగులకు ఇంటివద్దనే ఓటు ప్రక్రియ కూడా ప్రారంభం అయింది. ప్రత్యేకించి ప్రభుత్వ ఉద్యోగులు ముమ్మరంగా పోస్టల్ బ్యాలెట్ వేసే ప్రక్రియలోపాల్గొంటున్నారు. ఈ ఓటింగ్ సందర్భంగా వారు తమ పార్టీ అభిమానాన్ని దాచుకోవడానికి కూడా ప్రయత్నించడం లేదని తెలుస్తోంది. ఎవరికి ఓటు వేస్తున్నారో.. ఎందుకు వేస్తున్నారో కూడా బాహాటంగానే చర్చించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. చంద్రబాబునాయుడు పట్ల ఆయన ప్రకటిస్తున్న ప్రజానుకూల, ఉద్యోగులకు అనుకూలమైన విధానాల పట్ల వారంతా తమ ప్రేమను బాహాటంగానే చాటుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

ఏపీలోని ఉద్యోగవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల చాలా తీవ్రమైన అసంతృప్తి ఉంది. మరోరకంగా చెప్పాలంటే ఈ అసంతృప్తి పతాకస్థాయికి చేరి ద్వేషంగా కూడా మారుతోంది. జగన్ ను ఓడించి తీరాలని ప్రభుత్వ ఉద్యోగులు అందరూ చాలా పట్టుదలగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగుల్లో జగన్ పట్ల ద్వేషం ఉండడానికి చాలా కారణాలే ఉన్నాయి. 2019 ఎన్నికలకు ముందు జగన్ వారిని వంచించే హామీలు ఇచ్చారు. తనను గెలిపిస్తే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తానని అలవిమాలిన హామీ ఇచ్చారు. దానిని నమ్మి వారంతా ఓట్లు వేసి గెలిపించారు. గెలిచిన తర్వాత జగన్ తన విశ్వరూపం చూపించారు. పాత పెన్షన్ విధానం కాదు కదా, పీఆర్సీ విషయంలో ఆయన కొట్టిన దెబ్బకు ఉద్యోగులు తేరుకోలేకపోయారు. పీఆర్సీ తర్వాత ఉద్యోగుల జీతాలు తగ్గే  వాతావరణం దేశచరిత్రలో జగన్ ఏలుబడిలో మాత్రమే ఏర్పడింది. టీచర్ల మీద జగన్ పగబట్టినట్టుగా నిబంధనల్లో వారిని ఇరికించారు. ఇలా అనేక రకాలుగా జగన్ మీద ఉద్యోగుల్లో ఉన్న ద్వేషం పోస్టల్ బ్యాలెట్ సందర్భంగా కనిపిస్తోంది.

అదే సమయంలో చంద్రబాబునాయుడు తాను అధికారంలోకి వస్తే ఒకటో తేదీనాటికే జీతాలు, పెన్షన్లు అందజేస్తానని  ప్రకటించడం కూడా ఉద్యోగులను ఎంతగానో ఆకర్షిస్తోంది. జీతాలు అనేవి ఒకటో తేదీ తీసుకునే వ్యవహారం అనే సంగతిని వారు అయిదేళ్లుగా పూర్తిగా మరచిపోయారు. అలాంటిది ఇప్పుడు చంద్రబాబునాయుడు వస్తే తమ జీవితాల్లో స్వర్ణయుగం వస్తుందని ప్రభుత్వోద్యోగులు భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories