కట్టుకున్న భార్యకు షాక్ ఇచ్చిన దువ్వాడ తెలివితేటలు!

‘నా దగ్గర డబ్బుల్లేవ్.. అంతకంటె ఇంకేం చేయాలి’ ఈ ప్రశ్నకు ఎవరు మాత్రం ఏం సమాధానం చెప్పగలరు? ఎవరైనా సమాధానం చెబితే.. నా డబ్బు అవసరం మీరే తీర్చండి అనే మాట సూటిగా వచ్చేస్తుంది. అందుకే ఇలాంటి సమాధానం విషయంలో ఎవ్వరూ వేలుపెట్టకుండా ఉంటారు. ఇలాంటి బ్రహ్మాస్త్రంలాంటి తెలివితేటల ప్రయోగంతో.. టెక్కలికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్.. తన కట్టుకున్న భార్య, కన్న కూతుళ్లు షాక్ కు గురయ్యేలా చేశారు. వారి నోట మాట రాకుండా చేశారు. ఏ ఇంటిచుట్టూ వివాదం నడుస్తున్నదో.. ఆ వివాదానికి ఆయన లీగల్ పరిష్కారం చేసేశారు. ఆ ఇంటిని తాను సహజీవనం చేస్తున్న దివ్వెల మాధురి పేరిట రిజిస్టరు చేసేశారు.

టెక్కల వైసీపీకి మొన్నటిదాకా ఇన్చార్జిగా ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ వివాహేతర సంబందం కొన్నాళ్లుగా రచ్చరచ్చ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. తమ ఇంటికి రాకుండా ఆయన మాధురి అనే ప్రియురాలితో గడుపుతున్నారంటూ ఆయన భార్య దువ్వాడ వాణి ఎంత రచ్చ చేశారో అందరికీ తెలుసు. దువ్వాడ శీను, మాధురి ఇద్దరూ ఉన్న సమయంలో వారి ఇంటికి కూతురు సహావెళ్లి గొడవ చేశారు. దువ్వాడ శీను భార్య, కూతురుపై దాడికి ప్రయత్నించారు. ఇవన్నీ పోలీసుకేసులు అయ్యాయి. ఈలోగా మాధురి కారులో వెళుతూ మరో ఆగిఉన్న వాహనానికి ఢీకొని గాయపడింది. చికిత్స తీసుకుంటూ తాను ఆత్మహత్య చేసుకోవడానికే రోడ్డు మీదకు వచ్చినట్టుగా చెప్పింది. కారు యాక్సిడెంట్ చేసి అంబులెన్స్ లో ఆస్పత్రికి వెళుతుండగా దువ్వాడ శీను ఆమెకు ఫోను చేసి.. తన భార్య వాణి వల్లనే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్టుగా చెప్పాలని ప్రిపేర్ చేసినట్టు ఆడియో కూడా లీకై.. కలకలం సృష్టించింది.

ఇంకా నిర్మాణంలో ఉన్న ఒక ఇంటి గురించి భార్యకు ప్రియురాలికి మధ్య గొడవ నడుస్తుండగా.. దువ్వాడశీను తెలివిగా దానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఆ ఇంటిని ప్రియురాలు మాధురి పేరిట రిజిస్టరు చేసేశారు. ఆమె వెళ్లి ఆ ఇంటిలోనే తిష్టవేశారు. భార్య వాణి, కూతురు అక్కడకు వచ్చి రభస చేయబోగా పోలీసులు అడ్డుకున్నారు. తాను దువ్వాడ శ్రీనివాస్ కు రెండుకోట్లు ఓసారి, మరోసారి యాభై లక్షలు ఇచ్చానని ఆ డబ్బు తిరిగి తీర్చలేక తనకు ఈ ఇల్లు రిజిస్టరు చేసి ఇచ్చారని ఆమె డాక్యుమెంట్లు చూపింది. దువ్వాడ కూడా నా దగ్గర డబ్బుల్లేక ఇల్లు ఇచ్చేశాను అనడంతో వివాదం అక్కడకు సద్దుమణిగింది.

వివాహేతర సంబంధాల ఫ్యామిలీకోర్టు కేసు కాస్తా.. ఆస్తి తగాదాల సివిల్ కేసుగా మారింది. ముందు ముందు దువ్వాడ వారి ఫ్యామిలీ సీరియల్ లో మరెన్ని మలుపులు వస్తాయో వేచిచూడాలి. 

Related Posts

Comments

spot_img

Recent Stories